DailyDose

ఒక్క అవకాశం ఇస్తే సత్తా చూపిస్తాం-తాజావార్తలు

ఒక్క అవకాశం ఇస్తే సత్తా చూపిస్తాం-తాజావార్తలు

* దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకున్న అంశాలు అనూహ్యంగా మరుగున పడి పోయి కొత్త అంశాలు ముందుకు వచ్చి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ఈసారి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ అదే జరిగింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 లోక్‌సభ సీట్లకుగాను 39 సీట్లను బీజేపీ కూటమి గెలుచుకోవడంతో వాటి ఫలితాల ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉండవచ్చని తొలుత రాజకీయ విశ్లేషకులు భావించారు. జాతీయ అంశాలైన పుల్వామా–బాలాకోట్‌ అంశాల కారణంగా నాడు అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగిం.

* తెలంగాణజీహెచ్‌ఎంసీలో ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం: బండిసంజయ్. బీహార్‌లో ఎంఐఎం గెలవడానికి కేసీఆరే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంఐఎంకు కేసీఆర్ ఆర్థికసాయం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీకి అవకాశమిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారుల నియామకం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ఈసీ) పార్థసారథి తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుందని.. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని ఎస్‌ఈసీ సూచించారు.

* ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే టీ20, వన్డే సిరీసుల్లో కోహ్లీసేన సరికొత్త జెర్సీలు ధరించనుందని సమాచారం. ఇప్పుడున్న నీలం రంగులో కాకుండా అవి నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటి వరకు జెర్సీల మార్పుపై బీసీసీఐ అధికారికంగా వివరణ ఇవ్వలేదు. కాకపోతే కొవిడ్‌-19 నేపథ్యంలో ఎక్కువ రక్షణ అందించే కిట్లు అందిస్తున్నామని మాత్రం చెప్పింది.

* పబ్‌జీ అభిమానులకు శుభవార్త. త్వరలోనే ఈ గేమ్‌ని కొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్‌ పేరుతో భారత్‌లో విడుదల చేయనున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. అంటే గేమర్స్‌ పబ్‌జీలో ఇకపై కొత్త లుక్‌లో చికెన్‌ డిన్నర్‌ చేయొచ్చన్నమాట. కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జీ మాతృ సంస్థ క్రాఫ్టన్‌ ఇన్‌కో కంపెనీ పబ్‌జీని తిరిగి తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పబ్‌జీ గేమ్‌ కొత్తగా తీసుకురావడమే కాకుండా వంద మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ వెల్లడించింది.

* సరిహద్దు గ్రామాల ప్రజలు, భద్రతా దళాలు దేశ రక్షణలో ప్రధాన వాటాదారులని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని రక్షించడంలో వారిద్దరి పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో పాక్‌ సరిహద్దు వెంబడి ఉండే కచ్‌, భుజ్‌, బనస్కంత, పటన్‌ ప్రాంతాలను షా గురువారం సందర్శించారు. అనంతరం కచ్‌ జిల్లాలో నిర్వహించిన ‘వికాసోత్సవ 2020’ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు.

* బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ వరుసగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. నవంబరు 16న సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. భాయీ దూజ్‌ను పురస్కరించుకుని సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. అయితే తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. మంత్రివర్గ కూర్పుపై భాజపా, జేడీయూ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

* రాష్ట్రంలో వరి సన్నాలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళ తీరుపై హైదరాబాద్ కవాడీగూడ సీజీఓ టవర్స్‌లో ఎఫ్‌సీఐ, సీసీఐ, మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో కిషన్‌ రెడ్డి సమీక్షించారు.

* దిల్లీలో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 15 రోజుల్లో దేశ రాజధాని నగరంలో 870కి పైగా మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. అకస్మాత్తుగా కేసులు పెరగడానికి గాలిలో నాణ్యత క్షీణించడం, ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్య ధోరణులే కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్‌ 28 నుంచి రోజువారీగా 5వేలు చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ నిన్న ఒక్కరోజే ఆ సంఖ్య 8వేల మార్కును దాటేయడం కలకలం రేపుతోంది.

* జైలులో ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని వైద్యులను బాంబే హైకోర్టు ఆదేశించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని, ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే మేనన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన తరఫు లాయర్‌ ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు.

* తిరుపతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులిస్తే వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో సీఎం జగన్‌ లేరని ఆక్షేపించారు. తిరుపతిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉపఎన్నికలో భాజపా-జనసేన కూటమి పోటీ చేస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తామని సునీల్‌ దేవ్‌ధర్‌ ధీమా వ్యక్తం చేశారు.

* మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో అరెస్టయిన అమరావతిలోని కృష్ణాయపాలెం రైతులు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు రైతులను విడుదల చేశారు. విడుదలైనవారిలో కుక్కమళ్ల అమర్‌, నంబూరు రామారావు, ఈపూరి సందీప్‌, ఈపూరి రవికాంత్‌, ఈపూరి కిశోర్‌, సొంఠి నరేశ్‌, దానిబోయిన బాజీ ఉన్నారు. రైతుల విడుదల సందర్భంగా అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు జైలు వద్దకు వచ్చి వారికి ఘనస్వాగతం పలికారు. తెదేపాకు చెందిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, అమరావతి ఐకాస నేతలు సుధాకర్‌, మల్లికార్జున, శైలజ తదితరులు రైతులకు పూలమాలలు వేశారు. అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరని ఐకాస నేతలు, రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.