NRI-NRT

130మంది సీక్రెట్ సర్వీసు అధికారులకు కరోనా

130మంది సీక్రెట్ సర్వీసు అధికారులకు కరోనా

అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం, అధ్యక్షుడిని డేగకళ్లతో కాపలాకాయడంలో సాయపడే 130 మందికిపైగా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు కరోనా బారినపడ్డారు. దీంతో ఐసోలేషన్‌లో కానీ, క్వారంటైన్‌లో కానీ ఉండాలని ఉన్నతాధికారులు వారిని ఆదేశించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ వాషంగ్టన్ పోస్టు పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీల ద్వారా వీరికి వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ బృందంలోని 10 శాతం మందిని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. కొవిడ్ కారణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మంది సీక్రెట్ సర్వీసెస్ అధికారులు, ఏజెంట్లు క్వారంటైన్‌లో గడిపారు.