* దీపావళి పండుగ రోజు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు గోదావరి నదిలోకి దిగారు. దాదాపు 16 మంది స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగగా.. ఇందులో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైనవారు శ్రీకాంత్, కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌గా గుర్తించారు. ఈ ఘటన వెంకటాపురం మండలం రంగారాజపురంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.
* కరోనా కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం శత్రువులతో పోరాడే సామర్థ్యాన్నే కలిగి ఉండటం కాకుండా, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంలోనూ సాయుధ దళాలు ముందున్నాయని ఆయన ప్రశంసించారు. ‘‘కరోనా సమయంలో భద్రతా బలగాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించాయి. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మెడికల్ తదితర వస్తువులను అందించడంలో చాలా సమర్థవంతంగా సేవలందించాయి.’’ అని మోదీ ప్రశంసించారు.
* భర్తమీద కోపంతో ఓ తల్లి తన 14రోజుల వయసున్న పసిబిడ్డను భవనంపై నుంచి కిందకు పడేసింది. ఈ ఘటన సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్, ఫతేనగర్‌కు చెందిన లావణ్యలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండోసారి గర్భందాల్చిన లావణ్య ఫతేనగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. భర్తతో గొడవల నేపథ్యంలో గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు బాధితురాలిని సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సిజేరియన్ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి లావణ్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం తను నివాసం ఉంటున్న మూడో అంతస్తు పైనుంచి తన 14రోజుల పసికందును కిందకు పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు లావణ్య భర్త వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* విజయనగరం జిల్లా శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముసిడీపల్లి జంక్షన్ సమీపంలో సబ్ ఇన్స్పెక్టర్ లు నీలకంఠం, రాజేశ్ తమ సిబ్బంది తో కలసి వాహన తనికీలు చేస్తుండగా ఒక ఏచర్ వాన్ మరియు రాజస్థాన్ కు చెందిన లారి లో అక్రమంగా గంజాయి తరలిస్తుండటం గుర్తించగా సిబ్బందిని చూసి వాహన డ్రైవర్ లు పారిపోగా వాటి క్లీనర్ లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి శనివారం ఉదయం జిల్లా శ్ఫ్ సమక్షంలో నిందితులను గంజాయి ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
* నారాయణగూడలో దారుణం జరిగింది. మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మెట్రో ప్రయాణికుల సమాచారంతో నారాయణగూడ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి యొక్క వివరాలు సేకరిస్తున్నారు.