దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే రఘునందనరావు మర్యాదపూర్వకంగా బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ నాయకులు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి తదితరులను రఘునందనరావు కలిశారు. ఈ సందర్భంగా తన విజయం కోసం కృషి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గులాబీ సేన ప్రతిష్ఠాత్మకంగా భావించిన దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. తెలంగాణ, వామపక్ష ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరింది. టీఆర్‌ఎస్ గెలుపు యంత్రంగా చెప్పే హరీశ్‌రావు తన శక్తియుక్తులన్నీ ఫణంగా పెట్టినా అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 63,353 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు 62,273 ఓట్లు వచ్చాయి. గట్టి పోటీ ఇస్తారనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి 22,196 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
భాజపా నాయకత్వాన్ని కలిసిన రఘునందనరావు
Related tags :