ScienceAndTech

ఇక బ్రిటన్‌లో పెట్రోల్ బంకులు ఉండవు

ఇక బ్రిటన్‌లో పెట్రోల్ బంకులు ఉండవు

2030 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం విధించే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయన వచ్చేవారం ఒక ప్రకటన చేయవచ్చని సమాచారం. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తపత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకటించింది. వాస్తవానికి బ్రిటన్‌ 2040 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్లను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ, బోరిస్‌ జాన్సన్‌ అధికారం చేపట్టాక గడువును 2035గా మార్చింది. ఇప్పుడు దానిని మరింత ముందుకు తెచ్చి 2030కి కుదించే అవకాశం ఉంది.