* కడప జిల్లాలో శుక్రవారం జరిగిన హత్యతో ఒకరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతున్నాయి. తన అనుచరుడి హత్యపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. హత్య చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. కాగా ఎమ్మల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురుప్రతాప్‌రెడ్డి శుక్రవారం హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
* దీపావళి పండుగ పూట నగరంలోని పలు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా షో రూమ్స్‌లో, హార్డ్‌వేర్ షాపులు, బాణాసంచా దుకాణాల్లో ప్రమాదాలు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున భాగ్యనగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని రాందేవ్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల థాటికి చుట్టుపక్కలున్న జనాలు రోడ్ల మీదికి పరుగులు తీశారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగానే ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు షాపులో ఎవరూ లేరని సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* విశాఖ సిరిపురంలో ఉన్న గురజాడ కళా క్షేత్రం ప్రాంగణం సమీపంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్ కి అనుబంధమైన శ్రీ కన్య కంఫోర్ట్స్ ను వుడా స్వాధీన పరచుకుంది . విశాఖ నగరాభివృద్ధి సంస్థ విఎంమార్డీఏ నియామాయాలకు విరుద్ధంగా లీజు లో నిబంధనలు అతిక్రమనకు పాల్పడ్డారని అనే అంశంతో స్వాధీనపరచుకున్నట్టు విశాఖ నగరాభివృద్ధి సంస్థ చెప్తోంది.
* కలికిరి రేషన్ అక్రమ నిల్వలపై సిఐ సాధిక్ అలీ మెరుపు దాడి. భారీగా చౌకదుకాణం రేషన్ సరుకులు స్వాధీనం..వ్యక్తి అరెస్ట్. ఓ ఇంటిలో అక్రమంగా దాచి ఉంచిన రేషన్ అక్రమ నిల్వ కేంద్రం పై సిఐ సాధిక్ అలీ రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం దాడులు నిర్వహించి భారీగా చౌకదుకాణం రేషన్ సరుకులు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేశారు.సిఐ సాధిక్ అలీ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని పద్మావతి నగర్ కు చెందిన మహబూబ్ భాష చౌకదుకాణాలకు చెందిన రేషన్ సరుకులు భారీగా ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందించిన సమాచారంతో శనివారం తమ సిబ్బందితో పాటు సివిల్ సప్లై డిటి జయసింహా, ఆర్ ఐ అబ్దుల్ ఖాదర్ తో కలిసి వారి ఇంటి పై దాడులు చేయగా అక్రమంగా దాచి ఉంచిన 3.8టన్ను రేషన్ బియ్యం,1280కిలోల శెనగలు,380కిలోల కందిపప్పుతో పాటు మార్కు కలిగిన ఖాలీ సంచులు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసి మహబూబ్ భాష ను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉండగాప్రభుత్వ రేషన్ షాపులకు సంబంధించిన,ప్రజా పంపిణీ, వ్యవస్థ దారి మల్లుతున్నదని చాలామంది తనకు సమాచారం ఇవ్వడంతో దారుల్లో దాడులు నిర్వహించి ఎన్నో వాహనాలు సీజ్ చేశామని అదే విధంగా రేషన్ షాపు డీలర్లకు సమాచారం ఇచ్చి హెచ్చరించామని అయిన కొందరిలో మార్పు రాలేదని అన్నారు. రేషన్ అక్రమ వ్యాపారస్తుడు మహబూబ్ భాష ఇచ్చిన సమాచారం మేరకు 6నుంచి 10మంది డీలర్లు అక్రమ వ్యాపారంకు సహకరిస్తున్నట్లు సమాచారం ఉందని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రేషన్ సరుకులు అక్రమ వ్యాపారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో పీలేరు ఎస్ ఐ తిప్పేస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.