Movies

రణవీర్‌తో పాండే

రణవీర్‌తో పాండే

‘అర్జున్‌ రెడ్డి’తో తెలుగులోకి బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో పరిచయం కాబోతున్నారు. మరి… బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌లో సినిమా, అందులోనూ యూత్‌ క్రేజీ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సరసన అంటే క్రేజీ ప్రాజెక్టే కదా. దివ్యాంగ్‌ తక్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘‘ఈ అవకాశం ద్వారా నా టాలెంట్‌ను బాలీవుడ్‌లోనూ చూపిస్తాను. రణ్‌వీర్‌ సింగ్‌లాంటి సూపర్‌స్టార్‌తో కలసి నటించడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు షాలినీ పాండే. గుజరాత్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రంమిది. త్వరలో షూటింగ్‌ ఆరంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.