Politics

మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రికి తెదేపా తిరుపతి టికెట్టు

Ex-Congress Central Minister Panabaka Lakshmi To Contest In Tirupati

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయం కోసం శ్రేణులంతా కష్టించి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో ఉపఎన్నిక జరగనుంది.