కార్తీకమాసం మొదటి సోమవారం కావటంతో శ్రీశైలంలో భక్తుల రద్దీపరమేశ్వరుడి ఇల కైలాసంగా చెప్పుకునే శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.శ్రీ బ్రమరాంభ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని తరిస్తున్నారు.కార్తీక మాసం మొదలైన సందర్భంగా… ఆలయ వేళల్లో మార్పులు చేశారు.ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.తిరిగి సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం ఉంది.కరోనా నిబంధనలు పాటిస్తూ కార్తీక మాసోత్సవాలు జరుపుతున్నారు.
కార్తీక మాసం మొదటి రోజు మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది.దీనిని “ప్రభాస తీర్థం” అని కూడా పిలుస్తారుస్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు.సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం.ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు.