Agriculture

మీ గ్రామానికి నిధులు ఈ విధంగా తెచ్చుకోవచ్చు

మీ గ్రామానికి నిధులు ఈ విధంగా తెచ్చుకోవచ్చు

మీ గ్రామానికి నిధులు ఎలా వస్తాయో మీకు తెలుసా!

1.కేంద్ర ప్రభుత్వం నుండి 14 వ ఆర్థిక సంఘము ద్వారా మన గ్రామానికి సుమారుగా సంవత్సరానికి 35 లక్షలు వరకు వస్తాయి.

★ ఈ నిధులకి MP&MLA అనుమతి అవసరం లేదు నేరుగా సంబందించిన గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయబడతాయి.

2.కంకర మిల్లు(క్వారీ) ద్వారా గానీ, మరే ఇతర పరిశ్రమలు ఉన్న వాటి నుండి కూడా కొన్ని నిధులు వస్తాయి.

3.మన గ్రామ ప్రజలు కట్టిన వివిధ పన్నులు,ఇతర ఆదాయాలు గ్రామ పంచాయితీ ఖాతాలో జమ అవుతాయి.

★ ఈ నిధులు అన్నీ గ్రామానికి, గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతుంది.

4. MP & MLA కోటా నుండి కొన్ని నిధులు వస్తాయి.
★ వీటి ద్వారా గ్రామంలో వివిధ CC,మట్టి రోడ్లు,గ్రంధాలయం, గ్రామపంచాయతీ,BC,SC కమిటిహాల్లు నిర్మాణం చేస్తారు.

5. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ చట్టం కొత్తగా ప్రతి గ్రామానికి 5 లక్షలు ఇస్తాము అని చెప్తున్నాయి.

★ సమాచారం హక్కు చట్టం ద్వారా గ్రామానికి వచ్చిన నిధులు ఎన్ని? వచ్చే నిధులు ఎన్ని ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి అంటే MPDO , MRO దగ్గర దరఖాస్తు పెడితే గ్రామానికి వచ్చిన నిధులు సంబందించి సమాచారం అంతా 7 రోజులలో ప్రింటు పేపర్లు ద్వారా ఇస్తారు.

★ కేవలం 500 , 1000 రూపాయలకి, ఒకరోజు మందుకి ఆశపడి మన 5 సంవత్సరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టకండి.

★ అందుకే దయచేసి మీరు అవగాహన చేసుకోండి. అందరికీ తెలియజేయండి.