Politics

కాళేశ్వరం అవినీతి తవ్వుతున్నాను

Raghunandan On KCR Govt - I am digging into Kaleswaram Scams

బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ని ఎదుర్కొవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంఐఎంను మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ సోమవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్’‌లో రఘునందన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం’ అన్నారు రఘునందన్‌ రావు.