తన కుటుంబం ఎంతగానో నమ్మిన ఒక బాబా(ఆధ్యాత్మిక గురువు) తనను లైంగికంగా వేధించాడని బాలీవుడ్ వర్ధమాన నటి అనుప్రియ గొయెంకా సంచలన వ్యాఖ్యలు చేసింది. పద్మావతి, వార్, టైగర్ జిందా వంటి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ప్రస్తుతం ‘ఆశ్రమ్2’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తోంది. అయితే.. తన 18ఏళ్ల వయసులో తనకు ఎదురైన చేదు సంఘటలను ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకుంది. ‘మా కుటుంబం ఓ బాబాను ఎంతగానో విశ్వసించింది. అతను చెప్పే మాటలు వింటే ఎవరైనా అలాగే చేస్తారు. క్రమక్రమంగా నేను కూడా అతనిని నమ్మడం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. మా నమ్మాకాన్ని అలుసుగా తీసుకున్న అతను నన్ను లోబరుచుకోవాలని చూశాడు. ఆ సంఘటన నన్ను ఎంతో భయపెట్టింది. మొత్తానికి నేను అతని నుంచి తప్పించుకున్నాను. నిజానికి.. మొదట్లోనే ఆ బాబాపై కొంత అనుమానం కలిగింది. కానీ.. తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదని వేచి చూశాను. కొంతకాలం తర్వాత అతని ప్రవర్తనలో మార్పు గమనించాను. అలా ఒకానొక సమయంలో నాపై లైంగికంగా వేధింపులకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని ఈ మధ్యే మానాన్నతో చెప్పాను. ఇప్పుడు ఆ బాబా వృద్ధుడు కావడంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి మా కుటుంబం పూనుకోలేదు’ అని ఆమె చెప్పింది. అయితే.. ఇప్పటికీ తన జీవితంలో అలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారని అనుప్రియ చెప్పుకొచ్చింది. అతనితోపాటు కౌన్సెలింగ్ అవసరమైన మరో జోతిష్కుడు కూడా ఉన్నాడని పేర్కొంది.
అనుప్రియను వేధించిన ఆధ్యాత్మిక గురువు
Related tags :