అమెరికాలో శీతకాలం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిరాశ్రయులకు, నిరుపేదలకు ఉచితంగా ఆహారం అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దేశవ్యాప్తంగా వందకు పైగా ఫుడ్ బ్యాంకులకు ఆహారపదార్థాలు అందిస్తొంది. దీనిలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హరిస్బర్గ్ లో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో న్యూ హోప్ మినిస్ట్రీస్ ఫుడ్ పాంట్రీకి ఆహారపదార్థాలను అందజేశారు. తానా మిడ్ అట్లాంటిక్ విభాగం కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తానా కార్యదర్శి పొట్లూరి రవి, నాగరాజు నలజులలు హాజరయ్యారు. తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో మరికొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించి ఆహారపదార్థాలు అందజేస్తామని, 10000 కిలోల ఆహార పదార్థాలు అందజేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకట్ సింగు, సాంబ అంచ, కిషోర్ కొంక, వెంకట్ చిమ్మిలి, వేణు మక్కెన, చంద్ర వీరెల్ల తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
పెన్సిల్వేనియాలో తానా ఫుడ్ డ్రైవ్

Related tags :