Movies

ఘంటసాల కర్చీఫ్ కథలు

The story of hand kerchief of Singer Ghantasala Venkateswara Rao

ఘంటసాలకి రికార్డింగ్‌ సమయంలో చేతిలో కర్చీఫ్‌ ఉండాలట. పొరబాటున మర్చిపోతే ‘కర్చీఫ్‌ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయనకు అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. ఒకసారి ఏదో సమస్య వచ్చి తన పాట తనచెవికి వినిపించనట్లు అనిపించి ఘంటసాల వైద్య పరీక్షకు వెళ్లారట. పరీక్షించిన వైద్యుడు ‘అదేమంత ఇబ్బంది కాదు సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అందుకు ఘంటసాల అంగీకరించలేదట. తన చెవికి తన పాట వినిపించే దాకా పదిరోజు పాటు రికార్డింగ్‌లకు వెళ్లలేదట. వైద్యుడు చెప్పినట్లుగానే చెవి సమస్య దానంతట అదే సర్దుకొందట.