కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే అధినేత స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి నూతన పార్టీ పెట్టబోతున్నట్లు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని, త్వరలోనే పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా అళగిరికి మిగిలిన ఏకైక చివరి అవకాశం ఇదేనని అందుకే వచ్చే 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని తీసుకువస్తున్నట్లు అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఎప్పుడెప్పుడు పాగా వేద్దామా అని ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ దీనిని క్యాష్ చేసుకునే పనిలో ఉందట. సరిగ్గా చెప్పాలంటే అళగిరి పార్టీ ఏర్పటు వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా, అళగిరి పార్టీ పేరు ఇప్పటికే ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కలైంగర్ డీఎంకే’ కానీ ‘కేడీఎంకే’ అనే పేర్లతో ఈ పార్టీ ఉండబోతోందట. డీఎంకేకు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నట్లుగానే కేడీఎంకేకు దయానిధి స్టాలిన్ యూత్ వింగ్ బాధ్యతలు తీసుకోనున్నారట. త్వరలోనే 100-200 మంది అనుచరులతో కలిసిన అనంతరం మధురైలో అళగిరి తన పార్టీ ప్రకటన చేయనున్నట్టు బలంగా వినిపిస్తోంది.
కరుణానిధి వారసుణ్ణి నడిపిస్తున్న భాజపా
Related tags :