Business

ఇక అమెజాన్‌లో మందుల సరఫరా

Amazon Enter Pharmacy - Upload Your Prescription - Get Delivery

అమెజాన్‌ తాజాగా ఆన్‌లైన్‌ ఫార్మసీలోకి అడుగుపెట్టింది. అమెరికాలో మంగళవారం నుంచే అమ్మకాలు మొదలుపెట్టింది. అమెజాన్‌ తాజా అడుగుతో ఫార్మసీ రంగంపై గట్టి ప్రభావమే పడనుంది. ముఖ్యంగా అమెరికాలోని సీవీఎస్‌, వాల్‌గ్రీన్స్‌ వంటి ఔషధ గొలుసుకట్టు విక్రయశాలలపై ఇది కనిపించవచ్చు. మంగళవారం నుంచి క్రీములు, ఇన్‌సులిన్స్‌, ఇన్‌హేలర్ల అమ్మకాలను అమెజాన్‌ మొదలుపెట్టింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తే, ఇతర మందులు కూడా పంపడానికి రంగం సిద్ధం చేస్తోంది. కొంత కాలం నుంచి అమెజాన్‌ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి సారిస్తూ వస్తోంది. రెండేళ్ల కిందట పిల్‌ప్యాక్‌ అనే ఆన్‌లైన్‌ ఫార్మసీని 750 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.