* మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా చీకటి జీవోలను తీసుకొస్తోందని కేంద్ర మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. సింహాచలం పరిధిలో ఉన్న 104 ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్‌ను తొలగించి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయితను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో విజయనగరంలోని బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి తొలగించే విషయంలో తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడంపై అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్.రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికలకు నోటీసు.రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ.గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286.పురుషులు 38 లక్షల 56 వేల 770.మహిళలలు 35 లక్షల 46 వేల 847ఇతరులు 669.పోలింగ్ కేంద్రాలు 9248.గ్రేటర్ లో 150 వార్డులు.ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్.ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం.కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్ట నున్న ఈసీ.గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు.అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.
* ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో ప్రారంభమైన బ్రిక్స్ దేశాల సదస్సులో వర్చువల్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే దేశాలను జవాబుదారీ చేయడంతో పాటు వాటిని దోషులుగా నిలబెట్టాలన్నారు.
* కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తమ టీకాకు 95శాతం సమర్థత ఉన్నట్లు ప్రకటించిన మోడెర్నా సంస్థ మరో శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భద్రపరిచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్లు (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) సరిపోతాయని పేర్కొనడం ఊరట కలిగిస్తోంది. రిఫ్రిజిరేటర్లలోనే టీకాను 30రోజుల పాటు నిల్వఉంచడం సాధ్యమేనంటోంది. ఒకవేళ ఇదే సాధ్యమైతే టీకా పంపిణీకి కోల్డ్ స్టోరేజీ సమస్యను అధిగమించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
* తెరాస ఐదేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో తెరాస అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని చెప్పిన సీఎం కేసీఆర్, దానిపై ఎప్పుడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. దుబ్బాక నుంచి తెరాస పతనం ప్రారంభమైందని.. గ్రేటర్ ఫలితాలతో కల్వకుంట్ల పాలనకు స్వస్తి పలకాలన్నారు.
* జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీల కూటమి పీపుల్స్ అలయన్స్ జారీ చేసిన గుప్‌కార్ డిక్లరేషన్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలను మరో మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. భారత్‌ను కల్లోల పరిచేందుకు బాహ్య శక్తులతో చేతులు కలిపే వారితో కాంగ్రెస్ సహవాసం చేస్తుందని మండిపడ్డారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అమిత్‌షాజీ.. బాగా చెప్పారు. భారత్‌ను ముక్కలు చేసే నక్సల్ గ్రూప్‌లలో ఓదార్పును కాంగ్రెస్ వెతుక్కుంటోంది.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అపోహలకు తావులేదని, సామర్థ్యం మేరకే నీటి నిల్వ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వచ్చే 3 నెలల్లో ఏఏ పనులు చేయాలనే దానిపై సమీక్ష జరిపినట్లు చెప్పారు. కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం ప్రాజెక్టులో దశల వారీగా లక్ష్యం మేరకు నీటిని నిల్వ చేస్తామన్నారు.
* బిహార్ ప్రజలు గూండారాజ్‌ను తిరస్కరించి అభివృద్ధికి ఓట్లు వేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన ఒడిశాలో 2018 ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన ఆరు భాజపా కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధి అజెండాకు బిహార్ ప్రజలు ఆమోద ముద్ర వేశారన్నారు. కొన్ని పార్టీలు ఇంటి నుంచే కార్యాలయాలు నిర్వహిస్తూ.. కుటుంబ పార్టీలుగా మారాయంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తమకు మాత్రం పార్టీయే కుటుంబమన్నారు.