జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో రాజధానిల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌కు సమానంగా విపక్షాలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ సమావేశాలతో కారు పార్టీకి సవాలు విసురుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు అందరికంటే ముందుగా టీఆర్‌ఎస్ సిద్ధమైనప్పటికీ.. తామేమీ తక్కువ కాదంటూ కాషాయదళం దూసుకొస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసింది. మంగళవారం రాత్రి, లేదా బుధవారం ఉదయం మొదటి జాబితాను విడుదల చేయనుంది. అయితే ఎవరూ ఊహించన విధంగా బీజేపీలో టికెట్‌ల కోసం అభ్యర్థులు ఎగబడుతున్నారు. తమకంటే తమకే సీటు దక్కాలని పోటీపడుతున్నారు. మొదటి జాబితా ప్రకటించముందే తమకు టికెట్ ఇవ్వాలంటూ నిరసనకు దిగుతున్నారు.
భాజపా GHMC టికెట్ల కోసం భారీ డిమాండ్
Related tags :