Politics

GHMC ఎన్నికల సందడి 2020-TNI బులెటిన్

GHMC ఎన్నికల సందడి 2020-TNI బులెటిన్

* దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ కోసం సర్వం ధారబోశాను. కానీ నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది. ఈసారి మేయర్‌ సీటు బీజేపీదే. ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్‌ జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతిమంగా బీజేపీనే విజయం వరిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల‌ ఇంఛార్జ్ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ళ ఎక్కడని పేదలు అడుగుతున్నారు. వారికి కేసీఆర్‌ సర్కారు సమాధానం చెప్పాలి. అసలు మీరేం చేశారు’’అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్‌ మేయర్‌ పీఠం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ విజయం సాధించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాషాయ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వల వేస్తూ మంతనాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి పది గంటల తర్వాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ అసంతృప్త నేతల ఇళ్ళకు వెళ్లినట్లు సమాచారం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇళ్ళకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ వారితో చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలతో పాటుగా సనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దేవి ప్రసాద్ నివాసానికి కూడా కాషాయ పార్టీ నేతలు వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హడావిడి మొదలైంది. ఈ సందడిలో ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో వామపక్షాలు ఒక అడుగే ముందే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలో దిగనున్న సీపీఎం, సీపీఐ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలేవీ తీరలేదంటూ టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. దుబ్బాక హడావిడి అయిపోక ముందే దొంగచాటుగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఏమి చెయ్యమంటే అదే చేస్తుందని వ్యాఖ్యానించారు. రెండు నెలల ముందే ఎన్నికలను ప్రకటించారన్నారు. అలాగే వరద బాధితుల సహాయం నిజమైన వ్యక్తులకు చేరడంలేదన్నారు. మొన్నటి వరకు వరద బాధితులకు 10వేల రూపాయలు ఇస్తే ప్రస్తుతం అందరికి ఇస్తున్నారని,ఎన్నికలకు ముందు ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ గమనించి ప్రజలందరూ తమ పార్టీ ఓటు వెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితాచర్లపల్లి 3 డివిజన్‌ – పి . వెంకట్జంగమేట్ 45వ డివిజన్‌ – ఎ.కృష్ణబాగ్ అంబర్‌పేట్‌ 54వ డివిజన్‌ – ఎం. వరలక్ష్మిరాంనగర్ 87వ డివిజన్‌ -ఎం. దశరథ్అడ్డగుట్ట 142వ డిజిజన్‌ – టి . స్వప్నసీపీఐ అభ్యర్థుల మొదటి జాబితాహిమాయత్ నగర్ బి. చాయ దేవిషేక్‌పేట్ షైక్ షంషుద్దీన్ అహ్మద్తార్నాక – పద్మలలిత బాగ్ – మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ఓల్డ్ మలక్‌పేట్‌ -ఫిరదౌజ్ ఫాతిమాఉప్పుగూడ – సయెద్ అలీమరోవైపు దుబ్బాక ఉపఎ‍న్నికలలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో జీహెచ్‌హెంసీలో టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. జనరల్ కేటగిరీ కింద మహిళకు కేటాయించడంతో మేయర్ అభ్యర్థి విషయంలో కేసీఆర్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సాయంత్రం 6 గంటలకు పార్టీ జాబితా విడుదల చేయనుంది. దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకున్న జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ ఉత్సాహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపే లక్ష్యంగా కసరత్తును ముమ్మరం చేసింది. అటు కాంగ్రెస్‌ పార్టీలో గ్రేటర్‌ ఎన్నికల హడావిడి కనపించడం లేదు. పార్టీ స్పందన కోసం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గాంధీ భవన్‌లో ఎదురు చూస్తున్నారు. పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న గ్రేటర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ వైఖరితో పార్టీ కార్యాలయంలో నేతల జాడకోసం గ్రేటర్ ఆశావహులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

* టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ. 250 కోట్లు వరద సాయం నిధులు టిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రోడ్లెక్కి ఎదురు తిరగడంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారన్నారు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మీ సేవ వద్దకు బారులు కట్టారని తెలిపారు. అకౌంట్లలో డబ్బులు వేస్తే టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు రావని ఎద్దేవా చేశారు. ఓట్లు రావనే అనుమానంతోనే ఎన్నికల అధికారులు సహాయాన్ని నిలిపేయాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. ఎన్నికల సంఘం అదేశించిందన్న సాకుతో వరద సహాయం నిలిపేయడం దుర్మార్గమని, ఇది కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘‘జాతీయ విపత్తును పర్యవేక్షించే బాధ్యత కేంద్ర హోంమంత్రిగా కిషన్ రెడ్డికి ఉంది.

* దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్‌ నుంచే మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరిని ఈ సమావేశానికి ఆహ్వనిస్తామన్నారు. మమతా బెనర్జీ ,కుమార స్వామి ,అఖిలేష్ యాదవ్,స్టాలిన్‌తో పాటు మరికొన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. తాను ఫైటర్‌ని అని, దేనికి భయపడబోనని, బీజేపీపై యుద్ధమే చేస్తానన్నారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ ప్రజప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 110 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, అభ్యర్థులు, కార్యకర్తలు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. బీజేపీ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. ఈ రోజు జీహెచ్ఎంసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఎవరూ కంగారు పడొద్దని, అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. అందరికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. బీజేపీది వరద రాజకీయం : వదర సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా, వరద సాయం నిలివిపేయాలని ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఫలితాలు వచ్చే వరకు వరద సాయం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

* దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ కోసం సర్వం ధారబోశాను. కానీ నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది. ఈసారి మేయర్‌ సీటు బీజేపీదే. ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్‌ జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతిమంగా బీజేపీనే విజయం వరిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల‌ ఇంఛార్జ్ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ళ ఎక్కడని పేదలు అడుగుతున్నారు. వారికి కేసీఆర్‌ సర్కారు సమాధానం చెప్పాలి. అసలు మీరేం చేశారు’’అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్‌ మేయర్‌ పీఠం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. మరో 15 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా ఇవాళ రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే వామపక్ష పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాల్లో పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈరోజే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
1 కాప్రా పత్తి కుమార్
2 ఏఎస్‌రావునగర్ శిరీష రెడ్డి
3 ఉప్పల్ ఎం.రజిత
4 నాగోల్ ఎం.శైలజ
5 మున్సూరాబాద్ జక్కడి ప్రభాకర్
6 ఆర్కేపురం పున్న గణేష్
7 హయత్‌నగర్ గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి
8 హస్తినపురం సంగీత నాయక్
9 గడ్డిఅన్నారం వెంకటేష్ యాదవ్
10 సులేమాన్‌నగర్ రిజవన బేగం
11 మైలార్‌దేవ్‌పల్లి శ్రీనివాస్ రెడ్డి
12 రాజేంద్రనగర్ బత్తుల దివ్య
13 అత్తాపూర్ వాసవి భాస్కర్‌గౌడ్
14 కొండాపూర్ మహిపాల్ యాదవ్
15 మియాపూర్ షరీఫ్
16 అల్లాపూర్ కౌసర్ బేగం
17 బేగంపేట్ మంజుల రెడ్డి
18 మూసాపేట్ జి.రాఘవేంద్ర
19 ఓల్డ్ బోయినపల్లి అమూల్య
20 బాలానగర్ సత్యం శ్రీ రంగం
21 కూకట్‌పల్లి తేజశ్వర్ రావు
22 గాజులరామారం శ్రీనివాస్ గౌడ్
23 రంగారెడ్డి నగర్ గిరగి శేఖర్
24 సూరారం బి.వెంకటేష్
25 జీడిమెట్ల బండి లలిత
26 నెరేడ్‌మెట్ మరియమ్మ
27 మౌలాలి ఉమామహేశ్వరి
28 మల్కాజ్‌గిరి శ్రీనివాస్ గౌడ్
29 గౌతంనగర్ టి.యాదవ్‌

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసింది. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రజప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించారు. ప్రతిపక్షాలను విమర్శలను ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, 110 సీట్లకు పైగా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ 06, బీజేపీ 02, కాంగ్రెస్‌ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేది నవంబర్‌ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.