ScienceAndTech

ఇది హైదరాబాద్ పోలీస్ గర్వం!

Hyderabad Police Command Control Center Ready For Inaugural

“హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ – దేశానికే తలమానికం”

ప్రారంభానికి సిద్దమైన హైదరాబాద్ లోని “పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్” భారత దేశానికే తలమానికం గా నిలవనుంది.

7 ఎకరాల స్థలం లో బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 12 లో పూరి జగన్నాధ్ ఆలయం దగ్గర్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకొని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తుంది.

h ఆకారంలో హైదరాబాద్ ని సూచించే విధం గా A, B, C, D అనే నాలుగు టవర్లు, వాటిని కలుపుతూ బ్రిడ్జ్ లు. A టవర్ 20 అంతస్థులు, B, C, D టవర్లు 15 అంతస్థులు. A టవర్ మీద హెలీ ఫ్యాడ్ కూడా ఉండటం విశేషం.

భవిష్యత్లో లక్ష CC కెమేరాల డేటా ని ప్రోసెస్ చేయటానికి ఒక్క నిమిషం సరిపోతుంది అక్కడ. ప్రపంచ స్థాయి బెస్ట్ టెక్నాలజీ ని మొట్ట మొదటిసారిగా హైదారాబాద్ పోలీసులు వాడ బోతున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్రం లోని ప్రతి జిల్లా, మండలం లోని పోలీస్ స్టేషన్లు అన్నీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానమై ఉంటాయి. భవిష్యత్ లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది.