Politics

యువకులతో చర్చించా…ఎన్నికల్లో పోటీ చేస్తాం!

యువకులతో చర్చించా…ఎన్నికల్లో పోటీ చేస్తాం!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీకి దిగాలని యువ కార్యకర్తలు కోరుకుంటున్నారని, అనేక దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డాయని, తమ కార్యకలాపాలు సమీక్షించుకుంటూ ఈ ఎన్నికల్లో పోటీకి దిగాల్సిందేనని అభిప్రాయపడ్డాయన్నారు.