Politics

భాజపా-జనసేనలు కలుస్తాయా?-TNI GHMC 2020 ఎన్నికల బులెటిన్

2020 Elections Updatesభాజపా-జనసేనలు కలుస్తాయా?-TNI GHMC 2020 ఎన్నికల బులెటిన్

* జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ విధానాలు బాగుండి, ఎంఐఎం మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం కానీ.. వారికి ఎందుకిస్తామన్నారు. డిసెంబర్ నాలుగున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని, ఎవరితో తమకు పొత్తు లేదన్నారు

* రాజధానిలో రాజకీయం వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రాజకీయ రణరంగంలోకి దిగాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, కాం‍గ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం ప్రధాన పార్టీలుగా బరిలో నిలవగా.. పవన్‌ కళ్యాన్‌ నేతృత్వంలోనే జనసేన పార్టీ కాస్త ఆలస్యంలో రంగంలోకి దిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము పోటీచేస్తున్నామని పవన్‌ ఇటీవల ప్రకటించారు. అయితే బీజేపీ- జనసేన మధ్య మధ్య పొత్తు మాత్రం ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పవన్‌ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది. గ్రేటర్‌లో పొత్తు గురించి ఇరువురు నేతలు చర్చించనున్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే జనసేనతో పొత్తుపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధం చేయగా.. పొత్తు అనంతరం ఏ విధంగా మార్పులు చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని సంజయ్‌ ఇదివరకే ప్రకటించారు. తాజాగా పవన్‌ ప్రకటన నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం సందిగ్ధంలో పడింది.

* విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఆసక్తికర సమాధానం.మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్.బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా.గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని వ్యాఖ్య.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈరోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని, ఈసారి కూడా అదే ఛాలెంజ్ మళ్లీ చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… ‘ప్రతిసారి నేనే ఛాలెంజ్ చేయాలా? ఈసారి వాళ్లను చేయమనండి. వాళ్లు ఛాలెంజ్ చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా’ అని చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… తామైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని చెప్పారు. గోల్కొండపై కేసీఆర్ జాతీయ జెండాను ఎప్పుడో ఎగరేశారని… ఆ విషయం బండి సంజయ్ కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గోల్కొండపై కొత్తగా బండి సంజయ్ ఎగరేసేదేమీ లేదని అన్నారు.

* బల్దియాపై ఎగిరేది గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

* ఈ నెల 22 నుండి గ్రేటర్ లో కేటీఆర్ రోడ్డుషోలు..కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షో ప్రారంభం..28న ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగసభ.

* హైదరాబాద్ ప్రజల నోటికాడ ముద్దను లాక్కున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత