* నాచారం లో బీజేపీ నాయకురాలు విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నం.బీజేపీ నుండి టికెట్ ఆశించిన విజయలత రెడ్డి .ఇతరులకు కేటాయించారని మనస్తాపంతో ఆత్మహత్యాయాత్నం .స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన కుటుంబసభ్యులు .తమని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమకు టికెట్ రాకుండా మోసం చేసారని మనస్థాపం .గత గ్రేటర్ ఎన్నికలలో కూడా బీజేపీ నుండి పోటీ చేసిన విజయలత రెడ్డి..
* ఘంటసాల మండలం, చిట్టూర్పు వద్ద లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మరణించారు.
* గుమ్మనూరు పేకాట వ్యవహారంలో మంత్రి పాత్ర తేల్చడానికి సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్.సీబీఐ విచారణలో మంత్రి జయరాం పాత్ర తేల్చాలని పిటిషన్.పిటిషన్ పై విచారణకు అనుమతించిన హైకోర్టు.మంత్రి జయరాంను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్.
* రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం వాటిని జరగనివ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
* కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున దాడులు చేపట్టాలనే ప్రణాళికతోనే జైషే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని తెలిపారు జమ్ముజోన్ ఐజీ ముకేశ్ సింగ్.
* స్వలింగ వివాహాలను ధ్రువీకరించాలంటూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
* బంగాల్ మాల్డాలోని సుర్జాపుర్ బస్స్టాండ్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
* పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది.