ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్ సతీమణి వల్లేపల్లి ప్రియాంక సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణగూడ ప్రాథమిక పాఠశాల అభివృద్ది పనులు నిమిత్తం ₹11.5లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ నిధులతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ఆమె గురువారం నాడు శశికాంత్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రవి అధ్యక్షతన పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సేవా సంస్థ ప్రతినిధులు భూషణ్ రెడ్డి, భానుప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుమలేష్, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, సోలార్ విద్యుత్ పరికరాలు, మరుగుదొడ్లు, మంచినీటి వాటర్ ప్లాంట్లను పరిశీలించి ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రియాంక ఈ సందర్భంగా సభికులతో పంచుకున్నారు. బ్రాహ్మణగూడలో అభివృద్ధి పనులకు అవకాశం కల్పించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఛైర్మెన్ కాజ రమేశ్, తెలంగాణా ప్రభుత్వ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
బ్రాహ్మణగూడ పాఠశాలకు వల్లేపల్లి ప్రియాంక ₹11.5లక్షల విరాళం
Related tags :