Food

ఆవు పాలు పాల ఉత్పత్తులతో సర్వారోగ్యం!

ఆవు పాలు పాల ఉత్పత్తులతో సర్వారోగ్యం!

ఆవు పాలను తోడుపెట్టి బాగా చిలికినమజ్జిగ వగరు రుచిని కలిగి ఉంటాయి. అందువలనషుగరు వ్యాధిలోనూ,స్థూలకాయంలోనూ ఆవు చల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో ఎసిడిటీని పేగుపూతనీతగ్గిస్తుంది. గేదె మజ్జిగ కన్నా తేలికగాఅరుగుతాయి. అమీబియాసిస్ వ్యాధిలో ఆవు పెరుగు ఎక్కువమేలుచేసేదిగా ఉంటుంది. రక్తహీనతనుతగ్గిస్తుంది. లివర్ వ్యాధుల్లో ఇవ్వదగినవి. వేసవి కాలం త్రాగటానికి అనుకూలంగా ఉంటాయి.చలవ చేస్తాయి. మూత్ర పిండాల్లో రాళ్ళున్నవారికి ఆవు చల్ల మంచివి.
**ఆవునెయ్యి
గేదె నెయ్యి ఎన్ని మోసాలకుగురవుతున్నదో ఆవు నెయ్యి కూడా కల్తీకి గురవుతోంది. కల్తీలేని ఉత్తమమైన దాన్నిఎంచుకోగలిగితే, ఆవునెయ్యి సౌమ్యంగా పనిచేస్తుంది.శరీరానికి బలసంపన్నతనిస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, ఎలర్జీ వ్యాధుల్లో ఇదిమేలుచేస్తుంది. వెన్నని కాచిన తాజా నెయ్యిఉత్తమ గుణాలను కలిగి ఉంటుంది. విష దోషాలను హరించే గుణం దీనికుంది.
**ఆవు పాలు
అన్నిరకాల శరీరతత్వాల వారికీ అనుకూలంగాఉంటాయి. అతిగా వేడీ చెయ్యవు. అతిగా చలవాచెయ్యవు. సమశీతలంగా ఉంటాయి. విష దోషాల హరంగా ఉంటాయి.తల్లి పాలతో సమాన గుణాలనుకలిగి ఉంటాయి కాబట్టి చంటి బిడ్డలకు అనుకూలంగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, వాత వ్యాధులున్న వారికీ, ఆపరేషన్లు అయిన వారికి ఆవు పాలు మేలుచేస్తాయి.గర్భాశయానికి ఆవుపాలు టానిక్ లాగా ఉపయోగపడతాయి.
**ఆవు పెరుగు ప్రాణప్రదమైంది. తాపాన్ని తగ్గిస్తుంది. బలకరం.శరీర కాంతిని పెంచుతుంది. వేసవి కాలంలోరాత్రిపూట వేడి అన్నంలో ఆవుపాలు కలిపి నాలుగు మజ్జిగచుక్కలు వేసి తోడుపెట్టినఅన్నాన్ని ఉదయానే్న తింటే అమిత చలవ చేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుంది.
**ఆవు మూత్రం
నొప్పుల్నీ, వాపుల్నీ తగ్గిస్తాయని వస్తాదులుఅప్పటికప్పుడు పట్టిన ఆవు మూత్రంలో ఉప్పుకలిపి త్రాగేవాళ్ళట. ఆవు మూత్రంలో సోడియం, పొటాషియం లాంటి 24 రకాల లవణాలున్నాయి. ఈ లవణాల్లోబంగారానికి సంబంధించిన లవణాలు (గోల్డ్‌సాల్ట్స్)కూడాఉన్నాయని చెప్తారు. మూత్రంలో వైద్య ప్రయోజనాలకు ఉపయోగించే ద్రవ్యాల్ని యూరోకైనేజ్ అంటారు. ఇది కేన్సర్ మీద కూడా పనిచేస్తుందనిచెప్తారు. వారానికి ఒకసారి నిర్దేశిత మోతాదులో గోమూత్రాన్ని తీసుకుంటే కేన్సర్ కణాలనుఅదుపుచేస్తుందని, సూక్ష్మజీవులులేని స్వచ్ఛ పాత్రలోపట్టుకుంటే విష దోషాలు కలిగించదనీ, అందులోనియూరియా వెంటనే రక్తంలోకిచేరకుండానే విసర్జించబడ్తుందనీ గోమూత్ర నిపుణులు చెప్తున్నారు.
ఆవుల మలమూత్రాలు, పాలుపెరుగు, వెన్నవగైరా ద్రవ్యాలకు చెప్పిన గుణాలు కేవలంభారతీయ సంతతికి చెందిన ఆవులలో మాత్రమే కనిపిస్తాయి.అందుకే ఈ నేలమీద ఆవుకు అంతపవిత్రత, ప్రాధాన్యత!ఇంచుమించు ప్రతి దేవతకూ ఏదో ఒక జంతువుతో అనుబంధం ఉంది. కానీ వాటికి వేటికీ లేనిప్రాధాన్యత ఆవుకు మాత్రమే ఉండటానికి కారణాలనుపరిశీలించాలి.కొన్ని రకాల మొక్కల్లో బంగారం స్వల్ప మాత్రంలో ఉన్నట్టే భారతీయ గోసంతతిమలమూత్రాల్లోకూడా బంగారం ఉంటుంది. దాని పరిమాణం చాలా స్వల్పం కావచ్చు. కానీ అదివిలువైనదే! ఆవు గాల్‌బ్లాడర్ (చేదుకట్టుఅంటారు)ని వేరుచేసి ఎండిస్తే అందులోని బైల్ పదార్థంఎండి పలుకులుగా మారుతుంది.ఈ పలుకుల్ని గోరోచనం అంటారు. ఇది లివర్ కేన్సర్‌పైన కూడా సత్ఫలితాలివ్వగల శక్తివంతమైనఔషధం. థైరాయిడ్ లాంటి వ్యాధుల్లో దీనికి గొప్ప వైద్య ప్రయోజనాలున్నాయి.