ఈ నెల నవంబర్ 15, 2020, ఆదివారం నాడు అంతర్జాలంలో తాకా వారు ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల అందరిని ఆహ్వానించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తాకా ప్రెసిడెంట్శ్రీనాధ్ కుందూరి జ్యొతి ప్రజ్వలన చేశారు . తాకా వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ లయం వివిధ సంస్కృతిక కార్యక్రమాలను దాదాపు 4 గంటలు పాటు నిర్వహించారు.
తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరు , వ్యవస్థాపక అధ్యక్షులు చారి సామంతపూడి గార్లు భారతీయులు అందరూ కలసికట్టుగా ఉండాలని, ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన భారతీయ సంస్కృతిని కళలను ముందు తరానికి తీసుకువెళ్ళాలని ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని మరియు తాకా పది సంవత్సరాల నుండి నుండి చేసిన కార్యక్రమాలను తెలియచేసారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో తాకా వారు నిర్వహించిన తెలుగు సంస్కృతి పొటిలలొ దదాపు 300 పైగా చిన్నరులు వివిధ వర్గాలలొ నమోదు చెసుకొవటం గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల నెలరోజుల పాటు నిర్వహించిన తెలుగు సాంస్కృతి పొటీల విజెతలని సి.జి.ఐ మిస్ అపూర్వా శ్రీవాస్తవ ప్రకటిస్తూ గెలిచిన విజెతలను అభినందించారు.పొటీలలొ పాల్గొనటానికి ప్రొత్సహించిన తల్లి తండ్రులకు ప్రత్యేక అభినందనలను తెలీచేసారు. పోటీలలో క్రింది వారు విజేతలుగా నిర్ణయించారు.
*** వ్యాస రచన
జూనియర్లు
ప్రథమ స్థానం
విష్ణు తేజ పోకాల
ద్వితీయ స్థానం
నితిన్ సోము
సీనియర్లు
ప్రథమ స్థానం
వైభవియా కుప్పం
*** చిత్ర లేఖనము
జూనియర్లు
ప్రథమ స్థానం
శ్రీవిభ మాదరపు
ద్వితీయ స్థానం
కార్తీక్ సాయి ఉతుకూరు
సీనియర్లు
ప్రథమ స్థానం
ఇష్ణవి పెండెం
ద్వితీయ స్థానం
అనఘ దత్త హంసాల, హరిచరణ్ వేమూరి
*** గాయకులు
జూనియర్లు
ప్రథమ స్థానం
రోహన్ ముటుపురి
ద్వితీయ స్థానం
విగ్నేష్ ఆకుండి . మనస్విని వెలగపూడి
సీనియర్లు
ప్రథమ స్థానం
రిహానా ప్రవీణ్ , ఆశ్రిత పొన్నపల్లి
ద్వితీయ స్థానం
రేష్మ షాలిని
*** నృత్యము
జూనియర్లు
ప్రథమ స్థానం
మాన్వి కార్యంపూడి
ద్వితీయ స్థానం
జోష్ఠ దాలువాయి , పూష్ణే కోట్ల
సీనియర్లు
ప్రథమ స్థానం
అంకిత దేసు
ద్వితీయ స్థానం
అనీషా కొట్టి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరొంటొ మిస్ అపూర్వా శ్రీవాస్తవ, ఆల్బెర్టా రాష్ట్ర మంత్రి ప్రసాద్ పాండా, ఇతర భారత సంఘాల ప్రతినిధులు, సి.ఐ.ఫ్ ప్రెసిడెంట్ సతీష్ థక్కర్, ఎన్ ఎ.ఐ.సి ప్రెసిడెంట్ ఆజాద్ కౌషిక్, ఈకాల్ ప్రెసిడెంట్ పర్షోత్తం గుప్త విచ్ఛేసారు. న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించిన ఆన్నాప్రగడ వేంకట నరసింహ రావు, నగశ్రీ భి. యన్, లలిత బండారు, నిర్మలా రాజెష్, మబ్బు రవిశంకర్ రెడ్డి, శ్రిదేవి మింగర, సురెష్ రామపురం గార్లను తాకా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందనలను తెలియ చేశారు. ఎంతో అద్భుతంగా చేపట్టి మరియు విజయవంతం చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి, సురేష్ కూన, కల్చరల్ సెక్రటరి వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా తాకా కల్చరల్ సెక్రటరి శ్రిమతి వాణి జయంతి అందరికి పేరు పేరునా ధన్యవాదములను తెలీయచెస్తూ కర్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి విచ్ఛేసి జయప్రదం చేసిన తెలుగు వారందరికి పేరుపేరునా తాకా కార్యవర్గం ధన్యవాదములను తెలియచేసారు.