మీరు చదివింది నిజమే. ప్రతి రోజూ ఉదయించే సూర్యుడు ఆ ఊళ్లో మాత్రం మరో రెండు నెలల వరకూ కనిపించడు. అలస్కాలోని ఉట్‌కియాగ్విక్ పట్టణ ప్రజలు ఈ ఏడాదికి చివరి సూర్యోదయాన్ని చూసేశారు. 4300 మంది నివసించే ఈ అమెరికా పట్టణంలోని ప్రజలు బుధవారం చివరిసారి మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో సూర్యుడిని చూశారు. మళ్లీ వాళ్లకు వచ్చే ఏడాది జనవరి 23నే సూర్యుడు దర్శనమిస్తాడు. అంటే 66 రోజుల పాటు ఆ పట్టణం అంధకారంలో ఉండాల్సిందే. దీనినే పోలార్ నైట్ అని అంటారు. ప్రతి ఏటా ఇదే సమయంలో పోలార్ నైట్ వస్తుంది. ఉట్‌కియాగ్విక్ 71.29 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై ఉంది. దీని ప్రత్యేక జియోలొకేషన్ కారణంగా సుదీర్ఘ పోలార్ నైట్‌ను చూడాల్సి వస్తుంది. శీతాకాలం సమయంలో భూమి సూర్యుడికి దూరంగా వంగి ఉండటం కారణంగా పోలార్ సర్కిళ్లలో మాత్రమే ఈ పోలార్ నైట్స్ ఉంటాయి. రెండు నెలల పాటు సూర్యుడు కనిపించకపోవడం వల్ల ప్రతి ఏటా ఇక్కడి ప్రజలు ముందుగానే విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను సిద్ధంగా ఉంచుకుంటారు. ఇళ్లలో పగటి పూట వెలుతురును అందించే హ్యాపీ లైట్స్‌ను ఈ రెండు నెలల పాటు వాళ్లు వాడతారు.
66రోజుల అంధకారం
Related tags :