NRI-NRT

ఆశ్రమ పాఠశాలకు వల్లేపల్లి దంపతుల దాతృత్వం

Vallepalli Sasikant-Priyanka Helps Center For Social Services Ashram

హయత్‌నగర్ తుర్కయంజల్ మునిసిపాలిటీలోని మునుగునూరూలో గల సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఆశ్రమ పాఠశాలకు ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్, ఆయన సతీమణి, క్యూ హబ్ సీఈఓ ప్రియాంకలు నిత్యావసరాలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బాలికల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్న వేమూరి విజయలక్ష్మిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒక తరగతిని దత్తత తీసుకుని నిర్వహణను భరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు అందరూ బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు. ఈ సందర్భంగా 30మంది విద్యార్థినులకు ₹5లక్షల ఉపకారవేతనాలను అందించారు. 50మంది విద్యార్థినుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
ఆశ్రమ పాఠశాలకు వల్లేపల్లి దంపతుల దాతృత్వం-Vallepalli Sasikant-Priyanka Helps Center For Social Services Ashram