‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్నది సామెత. అయితే కొందరు నటీనటులు మాత్రం ముందు రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలుస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా తెలుగమ్మాయి అమ్రిన్ ఖురేషి చేరారు. పక్కా హైదరాబాదీ అయిన అమ్రిన్ ఇప్పటివరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఒకేసారి రెండు సినిమాల్లో కథానాయికగా డబుల్ ధమాకా దక్కించుకున్నారు. ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషి కుమార్తె, రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎమ్.ఐ. ఖురేషి మనవరాలు అమ్రిన్ ఖురేషి. తెలుగు సూపర్ హిట్స్ ‘జులాయి’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల హిందీ రీమేక్స్‌లో ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరో కావడం మరో విశేషం. ‘బ్యాడ్ బాయ్’ టైటిల్‌తో ‘సినిమా చూపిస్త మావ’ని రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్నారు. సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. ‘జులాయి’ రీమేక్‌కి టోనీ డిసౌజా దర్శకుడు.
తెలుగే…కానీ హిందీలో దూసుకెళ్తోంది!
Related tags :