* డీఆర్సీ సమావేశంలో రసాభాస… వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్సీ సమావేశం రసాభాసగా ముగిసింది.- వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఎంపీ సుభాష్ చంద్రబోస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.- టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ బోస్ ఆరోపించారు.- ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు తెలపాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.- తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ఆరోపించిన ద్వారంపూడి వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది.టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.ఎంపీ వ్యాఖ్యలను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు.ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
* అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూత.గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గొగోయ్.గౌహతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.కొన్ని నెలల క్రితం కరోనా నుంచి కోలుకున్న తరుణ్ గొగోయ్.ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గొగోయ్.మూడు సార్లు అసోం సీఎంగా సేవలందించిన తరుణ్ గొగోయ్.
* ప్రపంచంలో పసిడికి ఉన్న గిరాకీయే వేరు. ఈ బంగారం కోసం గనుల్లో అన్వేషిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అనేక రీతుల్లో బంగారం వెతుకులాట సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పర్వతాలపై పసిడి అన్వేషణ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆండీస్ పర్వతాల్లో ఈ తరహా వేట ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడి వారిలో వేలాది మందికి బంగారాన్ని వెతికి పట్టుకోవడమే పని. కేవలం ఈ ఉపాధితోనే కుటుంబాన్ని పోషించుకునేవారున్నారు. పర్వతాల్లోనే కాదు మురుగు నీటి నుంచి బంగారాన్ని వేరు చేస్తూ పొట్టపోసుకుంటున్న వారున్నారు.
* ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘అభయం’ యాప్‌ను సోమవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రయాణ సమయంలో మహిళలు, చిన్నారుల రక్షణకోసం ఈ యాప్ దోహదపడుతుందని చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రయాణ వాహనాల్లో అభయం యాప్ పరికరాన్ని అమర్చనున్నట్టు తెలిపారు. తొలి విడతగా విశాఖలో వెయ్యి ఆటోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 5వేల వాహనాలకు, జూలై 1 నాటికి 50వేల వాహనాలకు, నవంబరు నాటికి లక్ష వాహనాలకు అభయం యాప్‌ను విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణంలో మహిళలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే పానిక్ బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం అందతుందని వివరించారు. మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వివరించారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశామని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ బిల్లును రాష్ట్రంలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తే, అభయం యాప్‌ను రవాణాశాఖ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఉబర్, ఓలా ఆటోలు, ట్యాక్సీల్లోనూ ఇదే తరహా పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
* ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,130 నమూనాలను పరీక్షించగా 545 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా 10 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 6,948కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,390 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జికాగా.. రాష్ట్రంలో 13394 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో పేర్కొంది.
* కరోనా ధాటికి వణికిపోతున్న అమెరికాలో రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా జో బైడెన్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కరోనా కేసుల సంఖ్య 2కోట్లకు చేరుకుంటుందని తాజా పరిశోధన అంచనా వేసింది. అమెరికాలో ఇప్పటికే కోటి 22లక్షల మందిలో కరోనా సోకగా, వచ్చే జనవరి 20వ తేదీ నాటికి ఈ సంఖ్య 2కోట్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేశారు. భౌతికదూరం, కరోనా టెస్టుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని గణాంక పద్ధతిలో కేసుల సంఖ్యను అంచనా వేశారు.
* మానసిక సమస్యలు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి.. వెరసి ఓ మహిళ తన తల్లి మృతదేహంతో ఆరు నెలలుగా జీవనం సాగించిన దుర్భర సంఘటన ఇది. స్థానికుల సమాచారంతో ఎట్టకేలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. ముంబయిలోని బాంద్రా ప్రాంతానికి చెందిన తల్లి, కుమార్తె కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే తల్లి (83) మృతి చెందింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమార్తె (53) తల్లి మృతిపై ఎవరికీ సమాచారం అందించలేదు. బయటి వ్యక్తులెవరితో సత్సంబంధాలు లేకపోవడంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇంట్లోని చెత్తతోపాటు, మలాన్ని కూడా కిటికీ నుంచి బయట పడేస్తుండటంతో ఇంటి చుట్టుపక్కల వారు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే జీహెచ్ఎంసీ అభివృద్ధి సాధ్యమని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ప్రశాంత హైదరాబాద్ కావాలా? కల్లోల హైదరాబాద్ కావాలా? అన్నది ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికలకు తెరాస మేనిఫెస్టోను తెలంగాణ భవన్లో ఆయన విడుదల చేశారు. ఈ డిసెంబరు నుంచి దాదాపు 97 శాతం గ్రేటర్ ప్రజలు ఒక్క రూపాయి కూడా నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా నీరు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘దేశంలోనే గొప్ప చారిత్రక నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకున్న నగరం హైదరాబాద్. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కాస్మోపాలిటన్ సిటీగా మారింది. తెరాస ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు అర్థం చేసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. పేదలు, ధనికులను సమదృష్టితో చూసే ప్రభుత్వం మాది’’ అని సీఎం అన్నారు.
* ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడనుంది. పుదుచ్చేరిలోని కరైంకల్ -మామళ్లపురం మధ్య ఈనెల 25న తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
* జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరస సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే ఒవైసీ అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు.
* ఆదోని డివిజన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీసీ ఫెడరేషన్ నాయకులు సోమవారం తీర్మానం చేశారు. స్థానిక బీమాస్ హాల్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. అనాదిగా రాయలసీమ ప్రాంతం వెనుకబాటుకు గురవుతోందన్నారు. ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రజలు కరవు కాటకాలతో నిత్యం వలస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఉపాధి అవకాశాలు లేక, అభివృద్ధికి నోచుకోక ఇక్కడి ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు, మోహన్ ప్రసాద్, దేవిశెట్టి ప్రకాశ్, రమేశ్, డా. సోమశేఖర్ పాల్గొన్నారు.
* శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ రమేశ్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రపతి బసచేసే పద్మావతి అతిథి గృహం, వరాహస్వామివారి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కొవిడ్-19 ప్రొటోకాల్ పాటిస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
* జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ఉదయం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి 20వేల లీటర్ల వరకు ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు 97 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి కూడా నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు కూడా నీటి దుబారా తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
* కరోనా పోరులో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్ టీకా ప్రయోగ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారిలో 70.4శాతం సమర్థత కనబరచినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇక రెండు డోసుతో దాదాపు 90శాతం వరకూ ప్రభావవంతంగా వైరస్‌ను ఎదుర్కోగలదని మధ్యంతర సమాచార విశ్లేషణలో అభిప్రాయపడింది.
* పోస్టల్ బ్యాలెట్లను రద్దు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ మిడిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఊహాజనిత ఆరోపణలు చేశారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని జడ్జి మ్యాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు. వాదనల్లో ఒత్తిడి కనిపిస్తోందని, ఎలాంటి పసలేదని తెలిపారు. ఇక్కడ బైడెన్ 81వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఓట్లన్నింటినీ రద్దు చేయాలన్నట్టుగా వాదనలు వినిపించారని జడ్జి పేర్కొన్నారు.
* ‘అఖండ భారతం’ మీద నమ్మకం ఉందని, ఏదో ఒకరోజు కరాచీ భారత్‌లో భాగమవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరాచీ స్వీట్ షాపు పేరులోని కరాచీని తొలగించాలని ముంబయిలోని ఓ స్వీట్ షాపు యజమానిని ఓ శివసేన నేత బెరిదించిన అనంతరం ఫడణవీస్ ఈ విధంగా స్పందించారు.