DailyDose

ఇద్దరు జడ్జీల మధ్య సంభాషణపై సీబీఐ విచారణ-నేరవార్తలు

ఇద్దరు జడ్జీల మధ్య సంభాషణపై సీబీఐ విచారణ-నేరవార్తలు

* జస్టిస్ ఈశ్వరయ్య, న్యాయమూర్తి రామకృష్ణ మధ్య జరిగిన సంభాషణలపై విచారణ ప్రారంభించిన బెంగళూరు సీబీఐ.బెంగళూరు సీబీఐ నుంచి న్యాయమూర్తి రామకృష్ణకు పిలుపు.టెలిఫోన్ సంభాషణలతో పాటు పూర్తి ఆధారాలతో రేపు హాజరుకావాలని సీబీఐ ఆదేశం.

* టిడ్కో ఇళ్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ.కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.సాధ్యమైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.తదుపరి విచారణ 10 రోజులకు వాయిదా.

* విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగి లో లారీలో భారీగా తరలిస్తున్న గంజాయి పట్టివేత.దీని విలువ లక్షల్లో ఉంటుందని అంచనా.ఫారెస్ట్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా డ్రైవర్ పరారీ.ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు ఓఋ14క్ష్0033 లారీలో సుమారు 500 కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా లంబసింగి ఫారెస్ట్ గేటు వద్ద ఫారెస్ట్ సిబ్బంది పట్టుకొని తమ పై అధికారులకు తెలియపరిచారు.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

* రాజమహేంద్రవరంలో నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్యతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాడితోట అంబేడ్కర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య చేసుకున్నారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకుని చనిపోయిన మహిళ, ఆమె తల్లి. సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్ (9), రితిక (7) మృతులు.శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్తాపంతో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శివపావని భర్త నాగేంద్రకుమార్‌ది విజయవాడగా గుర్తించారు.

* ముగ్గురు మావోయిస్టుల మృతి. సోమవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కొద్దిసేపటి క్రితం జరిగిన ఓ ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారుఈ ఘటన పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా రావ్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొసరోండాలో జరిగింది.

* భార్య నగ్న వీడియోలు ఇంటర్నెట్లో పెట్టిన వంశీకాంతరెడ్డిని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. ఇతనితో పాటు ఏ5 శివకుమార్ను కూడా అరెస్ట్ చేశారు. శివకుమార్ ఫోన్ పేలో వంశీకాంతరెడ్డికి డబ్బు చెల్లించి వీడియోలు డౌన్లోడ్ చేసుకున్న ఆధారాలు సేకరించిన పోలీసులు.

* వేదింపులకు ఓ ముస్లిం మౌజాం ఆత్మహత్య యత్నం.పురుగు మందు తాగిన తాడికొండ మండలం లాం కు చెందిన షేక్ హనీఫ్.లాం లో ముస్లిం స్మశాన వాటికలో మట్టి తవ్వకాలు చేపట్టిన వైసిపి నేతలు.అక్రమ మట్టి తవ్వకాలను ప్రశ్నించిన మౌజాం హనీఫ్….హనీఫ్ పై దాడి చేసిన వైసిపి నేతలు.మనస్దాపంతో పురుగు మందు తాగిన హనీఫ్.

* గుంటూరు జిల్లా ఆచ్చంపేట మండలం తాడువాయి గ్రామానికి చెందిన మూడవతు హునుమయమ్మ అను వృద్ధురాల దగ్గర నుండి మూడు శేవిరిల బంగారపు నాతాడు ను ఇద్దరూ యువకులు లాకొన్ని వెళ్లినట్టు సమాచారం.