ప్రగతి భవన్ వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తా: రేవంత్ రెడ్డి సవాల్.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ రాజకీయం రంజుగా మారుతుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీయే లక్ష్యంగా విమర్శలకు దిగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించామంటూ మంత్రి కేటీఆర్ అబ్దాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.
లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా కేటీఆర్ ఇస్తే తాను టీఆర్‌ఎస్‌కే ప్రచారం చేస్తానంటూ బంపరాఫర్ ఇచ్చారు.
లక్ష మంది లబ్ధిదారుల జాబితా ఇప్పుడు బయటపెడితే మా పార్టీ అభ్యర్థులకు కూడా టీఆర్ఎస్ కండువా కప్పి కేటీఆర్ గొప్పోడు అని ప్రచారం చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
మరోవైపు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ పదేపదే అసత్యాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు.