నాట్స్ టెంపా విభాగం ఆధ్వర్యంలో థ్యాంక్స్ గివింగ్ టర్కీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా 100 కుటుంబాలకు ఆహారం, నిత్యావసరాలను నాట్స్ అందించింది. ఐటీ సర్వీసెస్ అలయన్స్ ఫ్లోరిడా విభాగం మరియు బటర్ ఫ్లై ఫార్మసీలతో కలిసి నాట్స్ ఈ థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రామ పిన్నమనేని, డాక్టర్ విజయ్, ఫణి దలయ్, సోమంచి, డాక్టర్ సుదర్శన్, రామ కామిశెట్టిలు విరాళం అందించరు. నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బటర్ ప్లై ఫార్మసీ నుంచి టోనీ జన్ను, టూటూ జన్ను, నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపా విభాగం సమన్వయకర్త ప్రసాద్ అరికట్ల, నాట్స్ టెంపా బే జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, ఐటీ సర్వీసెస్ అలయన్స్ ఫ్లోరిడా విభాగం ప్రెసిడెంట్ భరత్ ములపురు, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కండ్రు, నాట్స్ టెంపా కోర్ టీం అచ్చిరెడ్డి శ్రీనివాస్, ప్రభాకర్ శాకమూరి, సతీశ్ పాలకుర్తి, భాస్కర్ సోమంచి, నవీన్ మేడికొండ, భార్గవ్ మాధవ్ రెడ్డి, నాట్స్ ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ మాజీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.
ఫ్లోరిడాలో…100 పేద కుటుంబాలకు నాట్స్ సాయం
Related tags :