DailyDose

అక్రమ వసూళ్లు చేస్తున్న 9మంది విలేఖరులపై కేసులు-నేరవార్తలు

Krishna District Veerulapadu Police File Case On 9 Reporters

* అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మిది మంది విలేకరులపై కేసు నమోదు.-:-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి గారువీరులపాడు మండలం జయంతి గ్రామంలో లారీని ఆపి ఐదువేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు విలేకరులు.కత్తి చూపించి అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారంట అంటూ బెదిరించి 5000 లాక్కొని వెళ్లారని వీరులపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లారీ డ్రైవర్.50 వేలు డిమాండ్ చేసి ఐదు వేలు లాక్కొని వెళ్ళారని లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఇద్దరు విలేకరులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.విచారణలో భాగంగా ఇంకొక ఏడుగురు వ్యక్తులకు అక్రమ వసూళ్లలో భాగం ఉందని తేల్చిన పోలీసులు.మొత్తం 9 మంది విలేకరులపై కేసు నమోదు చేసిన వీరులపాడు పోలీసులు.

* టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‍ని తనిఖీ చేసిన పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఘటన. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన సమయంలో కాన్వాయ్‍లోని వాహనాన్ని తనిఖీ చేసిన తెలంగాణ పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే తనిఖీలు చేశామంటున్న పోలీసులు.

* యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానానికి తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఎస్​ఎఫ్​ మాజీ జవాన్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

* మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో భావన రత్తమ్మ (74) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి.

* గుంటూరుజిల్లాలోని సత్తెనపల్లిలో మహిళా వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.రేషన్ డీలర్ మల్లి వేధింపులు తాళలేక అంకేశ్వరి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిసింది.వేధింపుల విషయంపై ఆమె సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాసింది. ప్రస్తుతం వాలంటీర్‌ అంకేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. రేషన్ డీలర్ వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు డీలర్ తెలిపారు.

* రాయగడ జిల్లా సందు గోడ పంచాయతీ దుర్గ ఫుట్ వాటర్ ఫాల్స్ పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి.

* మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయం లో కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడుమోలు జాతీయరహదారిపై పల్సర్ బైక్ పై మచిలీపట్నం నుండి విజయవాడ వైపుకు వెడుతున్నముగ్గురు వ్యక్తులు స్థానిక మసీదు వద్ద అదే రహదారిపై విజయవాడకు వస్తున్న ఇండికా కారు పల్సర్ బైక్ ను వెనుక వైపుగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వారు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో కలపటం గ్రామఒకు చెందిన మద్దాల శ్రీను ప్రమాద స్థలంలోనే మృతిచెందడం జరిగింది.ఇదే బైక్ పై ప్రయాణిస్తూ గాయపడి హాస్పిటల్ కు తరలిస్తుండగా పెనుగుడి గ్రామానికి చెందిన ఎం డి ఇంతియాజ్ మార్గ మద్యంలోనే మృతి చెందడం జరిగింది.ఇదే బైక్ పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడటం జరిగింది.అప్పటికే సంఘటనా స్థలానికి చేరు కున్న కూచిపూడి ఎస్ ఐ తో కూడిన సిబ్బంది ప్రమాదానికి కారణమైన ఇండికా కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రమాద సంఘటన పై విచారణ జరుపుతున్నారు.