‘ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్‌లు లేరు. ప్రేక్షకుల ఆదరణ, అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగా’ అని చెప్పింది పాయల్ రాజ్‌పుత్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. దాయల్ పద్మనాభన్ దర్శకుడు. రాజా రామమూర్తి, చిదంబరం నిర్మించారు. చైతన్యకృష్ణ కీలక పాత్రధారి. ‘ఆహా’ ఓటీటీ యాప్ ద్వారా ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా చైతన్యకృష్ణ మాట్లాడుతూ ‘యాక్టర్‌గా ఎదగాలంటే అదృష్టం ఉండాలంటారు. ఆ లక్కీఛాన్స్ ఈ సినిమా రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది’ అని తెలిపారు.
‘సినిమా చూసిన తర్వాత భావోద్వేగంతో మాటలు రావడం లేదు. మంచి సినిమా చేశాననే సంతృప్తి నిచ్చింది. ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నది. కన్నడంలో దర్శకనిర్మాతగా చాలా సినిమాలు చేశానని, తెలుగులో తాను చేసిన మొదటి చిత్రమిదని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో వచ్చిన ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నానని, కన్నడ మాతృకకు అవార్డులు వచ్చాయని, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుందని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందచక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
నాకు అలాంటి తండ్రులు లేరు
Related tags :