DailyDose

కరోనా నియంత్రణకు రాత్రి కర్ఫ్యూ-తాజావార్తలు

Breaking News-Night Curfew To Control Covid in India

* స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రి పూట కర్ఫ్యూ వంటి నిబంధనలు విధించు కోవచ్చని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది..కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.ఇవి డిసెంబరు 1 నుంచి 31 వరకు అమలు లో ఉండ నున్నాయి. * కంటైన్‌మెంట్ జోన్ల వెలువల లాక్‌ డౌన్‌ కు కేంద్రం అనుమతి తప్పనిసరి.* కంటైన్‌మెంట్ జోన్ల లో అత్యవసర కార్య కలాపాలకు మాత్రమే అనుమతి.* కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.* పోలీసులు, జిల్లా యంత్రాంగానిదే నిబంధనల అమలు బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది.

* తితిదే ఆస్తుల వేలం వ్యాజ్యం పై విచారణ డిసెంబ‌రు 4 కు వాయిదా..★ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్‌ పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది.★ జస్టిస్ రాకేష్‌ కుమార్, జస్టిస్ డి. రమేష్ నేతృత్వం లోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది.★ ఆస్తుల వేలం ప్రక్రియను మే లోనే నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని.. తితిదే స్టాండింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ సూరి బాబు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.★ భూముల వేలం తో పాటు మరికొన్ని అంశాలు కూడా తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఉన్నాయని.. పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 49 మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని సుపరిపాలన వేదిక వెల్లడించింది..తెరాస లో 13, భాజపా లో 17, కాంగ్రెస్‌ లో 12, ఎంఐఎం లో ఏడు మంది ఉన్నట్లు పేర్కొంది.మొత్తం 49 మంది నేర చరిత్ర గల అభ్యర్థుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు సుపరిపాలన వేదిక తెలిపింది.‘‘మల్కాజ్‌గిరి డివిజన్‌ లో అభ్యర్థులందరికీ నేర చరిత్ర ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు ఉన్నారు. నేర చరిత్ర లేని వారికే ఓటు వేయాలి’’ అని సుపరిపాలన వేదిక నగర ప్రజలకు సూచించింది.

* నివర్ అతి తీవ్ర తుఫానుగా మారిందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు . చెన్నైకి 220 KM దూరంలో తుపాను కేంద్రీకృతమైందని .. రేపు ఉదయం తీరం దాటే అవకాశముందని , ఆ సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65-85 KM వేగంతో గాలులు వీస్తాయన్నారు . ఈ రాత్రికి నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు .. గురువారం చిత్తూరు , కర్నూలు , కడప , ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు.

* * రాష్ట్రంలో ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని అరాచక శక్తులు కుట్ర పన్నుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి ‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ శాంతికాముక నగరంగా పేరుగాంచిందని, కానీ, కొన్ని అరాచక శక్తులు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనై నగరంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

* భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. అనంతరం దిల్లీలో పవన్‌ మీడియాతో మాట్లాడారు. నడ్డాతో భేటీలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని పవన్‌ పునరుద్ఘాటించారు. తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తామన్నారు. దీనిపై ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని పవన్‌ చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామన్నారు.

* ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను డిసెంబర్‌ 3వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేసన్లు, మ్యుటేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ కొనసాగుతోంది. గతంలో విచారించిన హైకోర్టు ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేపట్టవద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

* తెరాస నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ భాజపాలో చేరారు. గత కొంతకాలంగా ఆయన భాజపాలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ భాజపాలో చేరినట్లు ప్రకటించారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపాలో చేరడం అంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని.. భాజపాను తన మాతృ సంస్థగా భావిస్తున్నట్లు చెప్పారు.

* భాజపా నేతల రెచ్చగొట్టే మాటలకు ఆగం కావొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీఐఎల్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. భాజపా నేతలు ఏది పడితే అదే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఆరేళ్లలో కేంద్రం నుంచి ఒక్కపైసా ఇవ్వనోళ్లు.. ఇప్పుడు ఇస్తారా అని ప్రశ్నించారు.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్‌ నిబంధనలను బుధవారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరించి వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల లాక్‌డౌన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టంచేసింది.

* నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రి 7గంటల నుంచి రేపు ఉదయం 7గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

* మీ ఇంట్లో ల్యాండ్‌ ఫోనుందా? దాని నుంచి మొబైల్‌ నంబర్లకు ఎక్కువగా కాల్స్‌ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే! వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మొబైల్స్‌కు కాల్స్‌ చేసేటప్పుడు మరో అంకె జోడించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పది అంకెల ముందు ‘0’ను కలపాల్సి ఉంటుంది. డయలింగ్‌ ప్యాట్రన్‌‌ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2,539 మిలియన్ల నంబర్లు అదనంగా లభించనున్నాయి. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం వివరాలు వెల్లడించింది.

* కాకినాడలో వైకాపా నేతల పంచాయితీ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వద్దకు చేరింది. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. తనను కలవాలని ఇద్దరు నేతలను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ద్వారంపూడి, సుభాష్‌చంద్రబోస్‌ సీఎంతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌ ఇరువురి వివరణ తీసుకుంటున్నట్లు సమాచారం.

* ఎన్నికలొస్తేనే భాజపాకు రోహింగ్యాలు.. పాకిస్థాన్‌ గుర్తుస్తాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భోలక్‌పూర్‌లో అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరున్నరేళ్లుగా కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలు ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే పట్టించుకోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. భాజపా, మోదీ ఫొటోతో కాకుండా తన ఫొటోతో ఓట్లు అడుగుతోందని వ్యాఖ్యానించారు.