* అనంతపురంలో ఉద్రిక్తత… పోలీసుల అదుపులో జేసీ పవన్అనంతపురంలో తెదేపా నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు.- ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు.- దీంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.- పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్రంలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు.ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.పవన్ కుమార్ను అదుపులోకి తీసుకుని, స్టేషన్ తరలించే క్రమంలో తెదేపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.పోలీసు జీపును తెదేపా కార్యకర్తలు అడ్డగించారు.పవన్ కుమార్ను రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరరం విడుదల చేశారు.
* గోపవరం మండలం పిపికుంట పొలీసు చెక్ పొస్టు వద్ద గోపవరం పోలీసులు వాహనాల తనిఖీలు….కర్నాటక దావణగిరె ప్రాంతానికి చెందిన కారులో తరలిస్తున్న 1 కోటి 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం…ఇద్దరిని అదుపులొకి తీసుకున్న పొలీసులు…నగదు శివమొగ్గకు చెందిన వక్కల వ్యాపారం చేసే యజమాని నాగేంద్రకు చెందినదిగా గుర్తింపు.
* నంద్యాల కేసులో పోలీసులకు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను జిల్లా కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
* రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో హై స్కూల్ వద్ద చిన్న ఘర్షణ చిలికి చిలికి గాలి వానాయింది.దీపావళి నాడు జరిగిన ఘర్షణ ఓ ఇంటి దీపాన్ని ఆర్పింది.కొడుకు పై దాడి చేస్తున్న వారిపై అడ్డుపడి తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.మంగళవారం అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ లో మట్టనాగభూషణం(45)వ్యక్తినిబండ రాళ్ళ తో కొట్టి హత్య చేశారు.ఘర్షణకు దారితీసిన కారణం దీపావళి పండుగ రోజు చిన్న పిల్లల తగాదా అని తెలుస్తుంది.ఇరు వర్గాలుపరస్పర ఘర్షణలో అర్ధరాత్రి సమయంలో మట్టనాగభూషణం ఇంటి పై బండ రాళ్ళ తో దాడి చేసి ప్రత్యర్థులు విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఘటన గణపవరం గ్రామంలో చోటుచేసుకుందిఘర్షణ లో తండ్రి మరణించాడు కుమారుడు వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి.
* సత్తెనపల్లి మండలం అబ్బూరూ గ్రామంలో బిటెక్ విద్యార్థిపురుగుల మందు తాగి ఆత్మహత్య.