Movies

“సన్ ఆఫ్ ఇండియా”

Mohanbabu's New Movie On Patriotism - Son Of India

మంచు మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రానికి ‘డైమండ్‌’ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ‘‘ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్‌ఫుల్‌ పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ తరహా కథ కానీ, ఈ జానర్‌ సినిమా కానీ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఇటీవల తిరుపతి షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించాం. హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై అధిక భాగం సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ సినిమాకు ‘డైమండ్‌’ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్‌ సంభాషణలు రాశారు. మోహన్‌బాబుకు స్టయిలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: చిన్నా.