‘‘నా కళ్లను నేను మూసి ఉంచుతున్నాను. మళ్లీ మిమ్మల్ని చూడాలనే ఆరాటంతో.. నా చెవులను మూసి ఉంచుతున్నాను. మీ మాటలను వినగలనని’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రముఖ నటి సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే. 1991లో వీరి పెళ్లయింది. ఒక కుమారుడు ఉన్నాడు. అంబరీష్–సుమలత హ్యాపీ కపుల్. భర్త మరణం తర్వాత సుమలత పైకి ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోలోపల ఆయన్ను ఎంతగా మిస్సవుతున్నారో ఆమె మాటలు చెబుతున్నాయి. అంబరీష్ చనిపోయి ఈ నవంబర్ 24తో రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా సుమలత తన మనసులోని భావాలను ఈ విధంగా పంచుకున్నారు.
సుమలత ఉద్వేగం
Related tags :