* ఎంపి తేజస్వి సూర్య పై ఓయూ పీఎస్ లో కేసు నమోదు.అనుమతి లేకుండా క్యాంపస్ లో కి ప్రవేశించి సభ నిర్వహించిన తేజస్వి సూర్య.క్యాంపస్ నిభందనలకు విరుద్ధంగా సభ నిర్వహించారంటు పోలీస్ లకు ఫిర్యాదు చేసిన ఓయూ రిజిస్టర్.
* బీజేపీకి చిత్తశుద్ది ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు వెంటనే భారతరత్న ప్రకటించాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
* బీజేపీమేనిఫెస్టోలోనిఅంశాలు..- మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం- గ్రేటర్‌లో బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా టీకాలు- నివాస ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా మంచినీరు- బస్తీల్లో వందశాతం ఆస్తి పన్ను మాఫీఎల్ఆర్ఎస్ రద్దుతో15 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా విముక్తి- వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్‌లో పడుతాయి- ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు- మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం- ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు- ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ- ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించడం- మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం- సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత- పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్- మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
* తెలంగాణగ్రేటర్ బరిలో 49 మంది నేరచరితులు.బీజేపీ-17, టీఆర్‌ఎస్13, కాంగ్రెస్-12, మజ్లిస్-7.మహిళా అభ్యర్థుల్లో ఆరుగురికి నేరచరిత్ర.మల్కాజ్‌గిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుందరిపైనా కేసులే.ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడి.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నవారిలో 49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) వెల్లడించింది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి తీసుకుని విశ్లేషించినప్పుడు ఈ విషయం బహిర్గతమైందని ఎఫ్‌జీజీ కార్యదర్శి యం. పద్మనాభరెడ్డి తెలిపారు. మొత్తం 96 కేసుల్లో 49 మంది అభ్యర్థులు నిందితులుగా ఉన్నారని చెప్పారు. అయితే, గత గ్రేటర్ ఎన్నికల్లో ఆయా పార్టీలు 72 మంది నేరచరితులకు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మంది నేరచరిత్ర కలిగిన వారికే టికెట్లు ఇవ్వడం ఒకింత శుభపరిణామని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని పధ్మనాభరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరిత కలిగిన అభ్యర్థులు పార్టీల వారిగా టీఆర్‌ఎస్-13, బీజేపీ-17, కాంగ్రెస్-12, మజ్లిస్-07 మంది ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురి మహిళా అభ్యర్థులపైనా కేసులున్నాయని ఎఫ్‌జీజీ వెల్లడించింది. మొత్తం గ్రేటర్‌లో నేరచరిత్ర కలిగిన వారు పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య 41 కాగా ఒక్క మల్కాజ్‌గిరి వార్డు(140)లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉందని పద్మనాభరెడ్డి తెలిపారు.
* టీడీపీపై మండిపడ్డ బండి సంజయ్.- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బండ్ సంజయ్.- ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తామంటే టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదు?- అక్బరుద్దీన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఎందుకు ఖండించలేదు? : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
* గ్రేటర్ ఎన్నికలకు భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మేనిఫెస్టోలో తెరాస ప్రభుత్వ అభివృద్ధి చిత్రాలు వాడినందుకు సంతోషమన్నారు. భాజపా మేనిఫెస్టోలో ఆ చిత్రాలు వాడటం ప్రశంసలుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెరాస అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలను భాజపా కాపీ కొట్టిందంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
* పొలిటికల్ టూరిస్టులతో హైదరాబాద్ నగరానికి ఒరిగేది ఏమీలేదు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్* కేసీఆర్ సింహం లాగా సింగిల్ గా వస్తున్నాడు* డజన్ల కొద్దీ ఢిల్లీ నాయకులు ఎన్నికలు అనగానే పరిగెత్తుకుని వస్తున్నారు* వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు* ఉద్వేగాలు కాదు – ఉద్యోగాలు ముఖ్యం* హైదరాబాద్ నగరాన్ని ఆగం చేయాలని చూస్తున్నారు* నగర ప్రజలు ఆలోచించి అభివృద్ధి పట్టం కట్టాలిమల్కాజిగిరి, శేరి లింగం పల్లి, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్