* కశ్మీర్లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతిజమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు.శ్రీనగర్ హెఎమ్టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఈనెల 28న కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో అలజడి రేపడమే లక్ష్యంగా ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం గాలిస్తున్నారు.
* కృష్ణాజిల్లా గన్నవరం:విమానాశ్రయం లో బంగారం పట్టివేత..కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.విచారణ చేస్తున్నట్లు సమాచారం.
* నగరంలోని బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రైల్వే బ్రిడ్జి ఫిల్లర్‌ను సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు.రెండు క్రేన్ల సాయంతో లారీని పక్కకు తీశారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
* అసోంలో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి.అసోం దిబ్రూగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.లెపెత్కట సమీపంలోని జాతీయ రహదారి-37పై నిలిచిన లారీని ఓ ఎస్యూవీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ప్రమాదంలో గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* అనిశా కేసులో అరెస్టై సస్పెన్షన్‌కు గురైన సీఐ జగదీశ్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం దొరికింది. ఊ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకు లాకర్‌ను బుధవారం సీఐ కుటుంబ సభ్యుల సమక్షంలో అనిశా అధికారులు తెరవగా రూ.34,40,200 నగదు లభించింది. రూ.9,12,800 విలువ చేసే 182.560 గ్రాముల బంగారం, రూ. 1020 విలువ చేసే 15.7 గ్రాముల వెండి ఉంది. ఇతర ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు లభ్యమయ్యాయి. సోదాల సమయంలో సీఐ ఇంట్లో కేవలం రూ.60 మాత్రమే దొరకడం గమనార్హం. లాకర్‌లో భారీగా నగదు లభ్యం కావడంతో అనిశా అధికారులు నివ్వెరపోయారు. ఇప్పటి వరకు జిల్లాలో ఓ సీఐ స్థాయి అధికారి వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించడం ఇదే తొలిసారి. బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా లాకర్‌లో నిల్వ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.