Movies

హైలీ బ్యాలెన్స్డ్

హైలీ బ్యాలెన్స్డ్

‘‘నాలో ఉన్న ప్లాస్‌ పాయింట్స్‌ ఏంటని అడిగితే నా దగ్గర సరైన సమాధానం ఉండదు. ఎలాంటి సందర్భంలోనైనా నేను చాలా బ్యాలెన్స్‌గా ఉంటా. ఏ వ్యక్తికైనా దానిని మించిన ప్లస్‌ పాయింట్‌ ఇంకేమీ ఉండదు’’ అని అంటున్నారు రాశీఖన్నా. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఆమె మాట్లాడుతూ ‘‘బ్యాలెన్స్‌గా వ్యవహరించడం అనేది ప్రతి వ్యక్తికి ఉండాల్సిన లక్షణం.జీవితంలో కొన్ని మెట్లు ఎక్కడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఆ క్వాలిటీ మా నాన్న నుంచి నాకు వచ్చింది. అలాగే ధైర్యం కూడా నాన్న నుంచి వచ్చిన జీన్సే. ఓ అమ్మాయి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్నది తన మీదే ఆధారపడి ఉంటుంది. తన మనసు చెప్పిందే వినాలి. ఈ విషయంలో వీరనారి ఝాన్సీలక్ష్మీ భాయ్‌ నాకు స్ఫూర్తి. సింగిల్‌మదర్‌గా ఆమె ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అది నాకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది’’ అని రాశీఖన్నా చెప్పారు.