కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో దిల్లీ నిర్వహించిన రైతులపై హరియాణాలోని కేంద్రం వ్యవహరించిన తీరుపై వామపక్షాలు మండిపడ్డాయి. దిల్లీ వైపు వెళ్తున్న రైతులపై జల ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా భాజపా తన రైతు వ్యతిరేకతను బట్టబయలు చేసుకుందని పేర్కొన్నాయి. పంజాబ్ నుంచి దిల్లీ వైపు వెళ్తున్న రైతులు రాష్ట్ర సరిహద్దు వద్ద హరియాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఈ తరుణంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన భాజపా ప్రభుత్వం రైతులపై చేసిన దాడిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగానే నిలుస్తుందన్న ఆయన.. చలో దిల్లీ కార్యక్రమంలో చోటుచేసుకున్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
హరియాణా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Related tags :