* బల్దియా ఎన్నికల వేళ బీజేపీ నాయకులు విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఢిల్లీ నుంచి బీజేపీ అగ్ర నేతలు కూడా వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంతేగాకుండా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు.ఈ రోడ్‌షోలో కొత్తపేట నుంచి నాగోల్ వరకు ప్రచారం చేశారు. జోరు వర్షంలోనూ రోడ్ షో కొనసాగుతోంది.ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు.ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ పాలనకు ముగింపులా అనిపిస్తోందన్నారు. తెలంగాణను అప్పుల మయంగా మార్చారన్నారు.
* భాజపా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడ్డూరంగా ఉందని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని అంశాలను ఆ పార్టీ నేతలు హామీలుగా ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని అంశాలు కాబట్టే ముందుజాగ్రత్తగా రాష్ట్రానికి సంబంధం లేని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో విడుదల చేయించారని ఆరోపించారు. బాధితులకు రూ.25వేల వరదసాయం ఎలా ఇస్తారని.. రేపు ప్రధాని వస్తున్నందున ఉత్తర్వులు ఇప్పిస్తారా? అని తలసాని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో తలసాని మాట్లాడారు.
* గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నాయకులు విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా రేపు ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్నె ప్రభాకర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల్లోగా కార్యకర్తలు స్టేడియానికి చేరుకోవాలని వెల్లడించారు. సమావేశంలో శానిటైజ్ చేసి, మాస్కులు ఇచ్చి లోనికి పంపిస్తామని కోవిడ్ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రచారానికి మూడు స్టేజీలు ఏర్పాటు, ఎల్బీ స్టేడియం బయట 12 స్క్రీన్ లు, సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. చిల్లర ప్రచారం చేస్తున్న వారికి కేసీఆర్ సమాధానం చెబుతారని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
* పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభకు హాజరైన మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమానికి హాజరైన టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎం.ఎల్.సి దయానంద గుప్తా తదితరులు పాల్గొన్నారు.
* తెలంగాణ కాంగ్రెస్ కి మరో దెబ్బ. పార్టీకి రాజీనామా చేసే యోచనలో పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి. బీజేపీలో చేరే అవకాశం.
* ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషన్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్యే ముఠా గోపాల్. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్ మెట్ డివిజన్ లో ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషన్ ను ఇంటికి వెళ్లి కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషన్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. భరత్ భూషన్ ఎన్నో అద్భుతమైన బతుకమ్మ చిత్రాలను తన కెమెరాలో బంధించాడు.
* జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకుగాను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక వినానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా బేగంపేట నుంచి నేరుగా కొత్తపేటకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు జరిగే రోడ్ షో లో నడ్డా పాల్గొననున్నారు.