లాక్‌డౌన్ విరామం తన సినీ కెరీర్‌కు ఎంతగానో ఉపకరించిందని చెప్పింది గోవా భామ ఇలియానా. కావాల్సినంత సమయం దొరకడంతో ప్రతికూల ఆలోచనల్ని పక్కనపెట్టి జీవితాన్ని ఆశావహదృక్పథంతో దర్శించే అవకాశం దొరికిందని తెలిపింది. ఇలియానా కథానాయికగా నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రీకరణ జరుపుకుంటోంది. బల్వీందర్ సింగ్ దర్శకుడు. సమాజంలోని శరీరవర్ణం తాలూకు వివక్షను చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలిరోజు షూటింగ్‌లో చాలా భయపడ్డానని..కెమెరా ముందుకొచ్చి చాలా రోజులు కావడంతో అంతా కొత్తగా అనిపించిందని ఇలియానా పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘షూటింగ్ మొదటి రోజు నా పాత్రను మరచిపోయాననే అనుమానం కలిగింది. ప్రాక్టీస్ చేసి వస్తే బాగుండేది అనుకున్నా. అయితే కెమెరా ముందుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే అంతా సర్దుకుంది. నాకు తెలియకుండానే పాత్రలో లీనమైపోయా. లాక్‌డౌన్‌తో లభించిన సుదీర్ఘ విరామం వల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా. నా శారీరక, మానసిక శక్తుల్ని ఈ విరామంలో పునరుత్తేజితం చేసుకున్నా’ అని చెప్పుకొచ్చింది ఇలియానా.
కావల్సినంత విరామం దొరికింది
Related tags :