నటుడిగా అవతారమెత్తనున్న రాఘవేందర్ రావు
వందకు పైగా హిట్ సినిమాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటుడిగా అవతారమెత్తనున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న రాఘవేంద్రరావు ఎన్ టిఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలను రూపొదించిన విషయం తెలిసిందే.
సభావేదికలపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడని రాఘవేంద్ర రావు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి రూపొందించనున్న ఓ సినిమాలో నటించనున్నారు.
రాఘవేంద్రరావు నటించే సినిమాలో రమ్యకృష్ణ, సమంత, శ్రియ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించనున్నట్టు తనికెళ్ల భరణి తెలిపారు.
రాఘవేంద్రరావు నటించే సినిమా గురించి వచ్చే ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన చేయనున్నామని భరణి వెల్లడించారు.
రాఘవేంద్రరావు నటించే సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.