కొన్ని పదార్థాలు నోటికి రుచించవు. కానీ వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఒనగూరే లాభాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో గోధుమ గడ్డి ఒకటి. ఇందులో ఉన్న అధిక పీచు కారణంగా మలబద్ధకం, బౌల్స్ సిండ్రోమ్, పైల్స్ వంటివన్నీ తగ్గుతాయి. జీర్ణశక్తి బాగుంటుంది. ఎ, సి, ఇ, కె, బి6 విటమిన్లతోపాటు ఖనిజాలూ ఫైటోకెమికల్సూ వంటివన్నీ సమృద్ధికరంగా ఉండటంతో అవన్నీ కలిసి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తాయి.
* గోధుమగడ్డిలోని 17 అమైనో అమ్లాలూ రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి.
* క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉండే వీట్ గ్రాస్‌ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అనేక పరిశీలనలూ చెబుతున్నాయి. అంతేకాదు, వరసగా నెలరోజులపాటు ఈ జ్యూస్ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట. ఇది మంటనీ బరువునీ కూడా తగ్గిస్తుందట.
* ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగేలా చేయడం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమస్యలతో బాధపడేవాళ్లకీ ఇది మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి దీన్ని జ్యూస్ లేదా ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోమని
చెబుతున్నారు పోషకనిపుణులు.
మేనోపాజ్ సమస్యలా? గోధుమగడ్డి సాయపడుతుంది.
Related tags :