పోలింగ్ శాతం తగ్గడంపై సీపీ సీరియస్ అయ్యారు. ఓటు వేసిన వారిని వేయనవారికి వేరే వేరేగా ట్రీట్ చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలీంగ్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమన్నారు. దీనిపై సమాజం ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 30 నుంచి 35 శాతం పోలింగ్ శాతం మాత్రమే నమోదయ్యిందని ఆయన భావించారు. కోట్లు ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ముతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన వారికి ఓ రకంగా ఓటు వేయని వారికి మరోరకంగా ట్రీట్ చేయాలన్నారు. ఓటు వేసిన వారికి ప్రొత్సాహకాలు అందించాలన్నారు. స్పెషల్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ఓటు వేసిన వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు.
మరోవైపు ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వకుండా నిబంధన తేవాలన్నారు. విద్యార్థులు సీట్లు పొందకుండా నిబంధన పెట్టాలన్నారు. జాబ్ అవకాశాలు విషయంలో కూడా ఈ వ్యత్సాసం చూపించాలన్నారు. దీనిపై యంత్రాంగంతో పాటు, ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఓటు హక్కుపై ఈసీ మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా నగరంలో పలుచోట్ల పర్యటనలు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం తగ్గడంపై రాజకీయ నిపుణులు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు. యువత ఓట్లు వేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ఐటీ సెక్టార్ వాళ్లు సెలవులు వస్తే వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, మీడియా ముందు చర్చల్లో మాట్లాడటానికి చదువుకున్నవాళ్లు ఆసక్తి చూపుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్పా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. గతఎన్నికలతో పోలిస్తే భారీగా ఓటింగ్ తగ్గడంపై విస్మయం చెందుతున్నారు. 2009లో 45. 27 శాతం, 2014లో 50.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది