* ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.అనంతరం బిల్లుపై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
* సీఎం జగన్ తీరుకు వ్యతిరేకంగా దాఖలైన 3 పిటిషన్లలో సుప్రీం కోర్టు రెండింటిని కొట్టేసింది.న్యాయమూర్తులపై సీఎం జగన్ ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే వేరే ధర్మాసనంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు జస్టిస్ సంజయ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం వెల్లడించింది.ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ పిటిషన్ వేశారు.యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్, సునీల్ కుమార్ అనే వ్యక్తి చెరో పిటిషన్ వేశారు.ఈ మూడింటికి సంబంధించి సుప్రీం కోర్టు విచారణ చేసింది.న్యాయమూర్తులపై ఆరోపణలతో లేఖ రాయడం, బహిర్గతం చేయడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు.లేఖ బహిర్గతం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.జగన్ లేఖపై కాలపరిమితితో అంతర్గత విచారణ చేయాలన్నారు.
* కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఆలయ పూజారులు పై ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి అమానుషమని ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు: వెలగలేటి సతీష్ కుమార్.
* రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.మంత్రిపై జరిగిన హత్యాయత్నం సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్‌ను పోలీసులు మంగళవారం బయటపెట్టారు.పక్కా పధకంతోనే టీడీపీకి చెందిన నాగేశ్వరరావు మంత్రి ఇంటి వద్ద కాపు కాసి దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.