భారత చెల్లింపుల దిగ్గజ సంస్థ పేటీఎంలో ఉన్న 30 శాతం వాటా విక్రయించేందుకు చైనా ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తోందని వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది. భారత్- చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న నేపథ్యంలో నిబంధనలు కఠినంగా మారుతుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఏడాది క్రితం జరిగిన ప్రైవేట్ నిధుల సమీకరణ సమయంలో పేటీఎం విలువను 16 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)గా లెక్కకట్టారు. పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, ఇతర సంస్థలకు పెట్టుబడులు ఉన్నాయి. దీని ప్రకారం.. పేటీఎంలో యాంట్ గ్రూప్ వాటా విలువ 4.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.36,000 కోట్లు) ఉండొచ్చు. వాటా విక్రయ వార్తలను యాంట్, పేటీఎం కొట్టిపారేయడం గమనార్హం. వాటా విక్రయానికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
PayTM నుండి తప్పుకోనున్న చైనా సంస్థ
Related tags :